పుట:Kashi-Majili-Kathalu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15]

కాదంబరి కథ

113


లగుట నదియంతయు సహజానురాగ మేమో యని సందేహడోలిక యెక్కి యూగుచు నాప్రోయాలి విరహాగ్ని పాలుసేసి నీచే నిట్లు నిందింపఁబడితిని.

మఱియు నాకీ మనోవ్యామోహము గలుగుట శాపదోష మేమో యని యాలోచించుచుంటిని. కానిచో నాచిన్నది యతిస్ఫుటముగా నదనచిహ్నములఁ బ్రకటింపుచుండ నే నెందులకుఁ దెలిసి కొనలేక పోయితిని. నాబుద్ధి సురిగిపోయినది. పోనిమ్ము స్మితావలోకన లీలావిశేషము లతి సూక్ష్మములగుటఁ దెలిసికొనుట కష్టము. మరియొక కారణము వలనం బుట్టుచుండును.

చిరకాలమునుండి తన కంఠమందున్న రత్నహారము నూరక నా మెడయందువైచునా? అప్పుడైనం దెలిసికొనరాదా? అదియునుం గాక హిమగృహక వృత్తాంతము నీవుగూడఁ జూచినదేగదా! అప్పుడైనఁ బ్రణయకోపమునం గాబోలు శ్లేషగానే పలికినది కాని స్పష్టముగాఁ జెప్పినదికాదు. అదియంతయు నామెదోషమే కాని నాదికాదు.

పత్రలేఖా! ఇప్పుడు గతమునకు వగచినఁ బ్రయోజనము లేదు. నా హృదయ మెట్లామెకుఁ దెలియునో యట్లు ప్రవతి౯ంచువాఁడ నన పలుకుచుండఁగనే ప్రతిహారి జనుదెంచి నమస్కరించుచు, దేవా! విలాసవతీ! మహాదేవి పత్రలేఖతోఁగూడ మిమ్ము రమ్మని యాజ్ఞాపించుచున్నది. పత్రలేఖ దేశాంతరమునుండి వచ్చినదని విన్నదఁట వేగరండని విన్నవించుటయుఁ జంద్రాపీడుఁడామాటవిని అయ్యో! నాజీవితము సందేహడోల యెక్కి యూగుచున్నది. నాతల్లి నిమిషమైన నన్నుఁ జూడకుండలేదు.కాదంబరి యవస్థ పత్రలేఖ యెఱింగించినది. జననీ స్నేహమా జన్మక్రమాహితమగుట బలమైనది.

పితృశుశ్రూషయు నట్టిదే. గంధర్వ రాజసుతానురాగ మంతకన్న బలమైనది. జన్మభూమి విడువందగినదికాదు. కాదంబరియుఁ