పుట:Kashi-Majili-Kathalu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

111

నన్ను బలత్కారముగా వారించితివనిన బంధకీధాష్ట్యము తప్పక రావలయుననిన సౌభాగ్యగర్వమగును నేనవచ్చుచున్నదాన వంటి నేని స్త్రీచాపల్యముగదా అనన్యరక్తసన స్వభక్తినివేదన లాఘవ దోషమువచ్చును. మదీయ మరణంబున నాకు నీయందుఁగల ప్రీతినిఁ దెలిసికొనఁగలవు. అనినసంభావము గదా!*[1] (ఇంతవరకు కాదంబరీ పూర్వభాగము. ఇంతవరకే బాణకవి కవిత్వము.)

కావున నేమన్నను దోషమే కనంబడుచున్నది. నాఁడు అంబరంబునఁ గళానిధిజ్య్నోత్స్నావితా నంబున దెసల వెదజల్లుచుఁ బ్రకాశింపుచుండఁ గ్రీడాపర్వత కనితంబంబు నందలి కాసారతటంబున శిలాపట్టణమునఁ బ్రకాశించు హిమగృహంబునఁ బుష్పశయ్యయందుఁ బండికొని యక్కుమారునిచేఁ జూడఁబడితిని. ఱెండుసారులువచ్చినా యపస్థయంతయుం జూచి యుపేక్షజేసిపోయెనే? ప్రియసఖీ! నీతో నేమందును? కూర్చున్నను, దిరుగుచున్నను, నిద్రించుచున్నను, మేల్కోన్నను, రాత్రింబగలాశ్రీమంటపమున నాయుద్యానవనమున నాలీలాదిఘి౯కయందుఁ గ్రీడాపర్వతమందా కుమారునిఁ జూచుచునే యుంటి నామాటయే నీకుఁ జెప్పుచుంటిఁ దదానయనకథతో నిఁకఁ జాలు. ఎక్కడిరాక. అని పలికి యక్కలికి శోకవేగంబున భుజలతల యందు శిరము వంచి మూర్ఛవోయినది వోలెనూరకున్నది.

నేనామాట వీని ఆహా! వియోగులు జీవించుట కష్టము గదా? సంకల్పమయుండగు ప్రియుండు గులాంగనల బాధించును. సంకల్పక్రీడలతోఁ బొద్దుపుత్తురు. అని నేను దలంచుచుండఁగనే సూర్యాస్తమయమైనది. అప్పుడు బాలికలు పెక్కండ్రువచ్చి వింత వింతగాఁ దీపములు వెలిగించిరి. నేనామెం జూచి దేవీ! నీవు

ఇంతవరకు రచించి బాణకవి “స్వర్గస్దుడయ్యెను. తరువాత జివరకు నతని కుమారుడు రచించెను.

  1. *ఇంతవరకు రచించి బాణకవి స్వగ౯స్థుఁ డయ్యెను. తరువాతఁ జివరకు నతని కుమారుఁడు రచించెను.