పుట:Kashi-Majili-Kathalu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

109


తరువాత నీవు జీవితము విడుతువుగాక యని యడిగిన నత్తరుణి యిట్లనియె.

బోఁటీ! వినుము. ఆధూర్తుండు కలలో వచ్చివచ్చి శుకశారికలచే రహస్యసందేశముల నంపుచుండెను. వ్యధ౯మనోరధ మోహితుండై నిజానురాగంబునంబోలె నాచరణముల నలక్తకరసంబున రజింపఁజేయును. గపోలస్వేదమును ముఖమారుతమునఁ బోగొట్టు చుండును. ఉపవనంబున నేనొంటిగాఁ గ్రుమ్మరుచు గ్రహణ భయంబునఁ బారిపోవ నడ్డమువచ్చి బిగ్గరగా గౌఁగలించును. స్తనతటంబునఁ బ్నత్రరచనలు చేయును. కచగ్రహణముచేసి సురాగండూషములఁ బలుమారు నాముఖంబున నిడుచుండెను.

పత్రలేఖా! ఆ నిశ్చేతను నేనెట్లు పట్టుకొందునో చెప్పుము. అనుటయు నేనామె మాటలు విని చిత్తంబున అన్నా! యీ చిన్నది చంద్రాపీడుని గురించి మన్మధునిచే మిక్కిలి దూరముగా నావషి౯ంపఁబడినది. "నిక్క మీ చక్కెరబొమ్మ మూలమున నతండును పుష్ప కోదండుని బాగింబడియుండెను."

అని మనంబునఁ దలంచుచు యువతీ! నీవిధమెఱింగితిని కోపము విడువుము. కామాపరాధంబున మాచంద్రాపీడుని నిందింపకుము. ఈ చేష్టలన్నియు శకుండగు మన్మధునిచే కాని మాదేవరవికావు. అని పలికిన నక్కలికి సంతసించుచు మోమెత్తి యిట్లనియె.

కామినీ! కాముఁడన నెవ్వఁడు? వాని రూపమెట్టిది? వానిచేష్ట లెట్టివో! చెప్పుమన నేను తరుణీ! వానికి రూపములేదు. శరీరము లేకయే దహింపఁగలఁడు. జ్వాలావళిజూపకయే సంతాపము గలుగఁజేయును. పొగ లేకయే కన్నీరు పుట్టించును. అట్టి భూతమీ భువన త్రయంబునను లేదు. ఎట్టి ధైర్యముగలవారినైన బారింబడిరేని వేధింపక మానఁడు. మఱియు నతనిచేత నావేశింపఁబడిన స్త్రీలకు గగన