పుట:Kashi-Majili-Kathalu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

107

అప్పు డతఁడయ్యింతి చేయి బట్టుకొని యభ్యంతర మందిరమునకుఁ బోయి యందు స్థలకమలినీ పలాశచ్ఛాయచేఁ జల్లనై యున్న మరకత శిలామంటపమున నిద్రించు మరాళమిథునమును దోలి యందు గూర్చుండి యల్లన దానితో నిట్లనియె.

పత్రలేఖా! నేను వచ్చిన తరువాత నచ్చట జరిగిన విశేషము లెట్టివి? నీవందెన్నిదినము లుంటివి? నిన్నెట్లు చూచినది? యేమేమి గోష్ఠివచ్చినది? కాదంబరి నామాట యెప్పుడైన స్మరించినదా? యని యడిగిన నబ్బోటి దేవా! దేవర వచ్చిన తరువాత నందు జరిగిన విశేషములం జెప్పెద దత్తావధానులై వినుండని యిట్లనియె.

మీరల్ల నాఁడుదయంబునఁగదా! అఱిగితిరి. మీరు వెళ్ళిన గొంతసేపటికి కాదంబరి పరిజనుల విడిచి నన్ను బాలోద్యానవనమునకుఁ దీసికొనిపోయి అందుమరకత సోపానములచే దీపించు ప్రమదవన వేదికయందు మణిస్థంభమూతగాఁ గూర్చుండి ముహూత౯కాల మూరకొని యెద్దియో పలుక నిశ్చయించి రెప్పవేయక పెద్దతడవు నా మొగము చూచినది.

అప్పుడు నేనామె యభిప్రాయము గ్రహించి, అయ్యో! తొయ్యలీ! భయపడియెదవేల? యెద్దియేని జెప్పవలసియున్నఁ జెప్పుము. నన్నన్యఁగా దలంపకు మని పలికిన విని యక్కలికి పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు మాటిమాటికి నలుమూలలు సూచుచు జెప్పఁదలఁచుకొనియు సిగ్గుపెంపునఁ గంఠము గద్గదికబూన నెలుంగు రాక యూరకొని తలవంచి కన్నులనుండి ప్రవాహంబుగా నీరు గార్చినది.

మఱియు నేను పలుమారు మగువా? నీకిది తగునా? కారణ మెద్దియో చెప్పుము. ఊరక కన్నీరు నించెదవేలనని యడుగగా నతి ప్రయత్నముతోఁ గన్నీరు దుడిచికొనుచు వక్తవ్యాంశమును నఖ