పుట:Kashi-Majili-Kathalu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14]

కాదంబరి కథ

105


యోరీ! నీవిందుండుము. ఇచ్చటికిఁ బత్రలేఖను గేయూరకుఁడు దీసికొని వచ్చును. దానితోఁగూడ నీవింటికి రమ్మనిపలికి వెండియు నిట్లనియె.

మానవజాతి దుష్ప్రకృతిగలది. నీయుపచారములన్నియు నాత్మార్పణముచేసి నీ యకారణసత్పలత గణింపక వాజ్మౌనసములకు భిన్నాధ౯త్వము గలుగజేసితి నని తలంచెదు కాబోలు. ఆస్థానమం దెక్కుడు దయఁజూపిన నీసాధుత్వ మెన్నటికేని మరువఁదగినదే? నా గుణముల నీయొద్ద మిక్కిలిగా స్తుతిజేసిన మహాశ్వేత నిప్పు డెత్తిపొడుచు చుందువని నా హృదయము మిక్కిలి సిగ్గుజెందుచున్నయది నే నేమి చేయుదును. తండ్రి యాజ్ఞ యెక్కుడుదిగదా! అది శరీరమాత్రమునకే యుపయోగించును. హేమకూట నివాసవ్యసనముగల నామనస్సు చేత జన్మాంతర సహస్రములయందు నీకు దాస్యము చేయుదునని బట్టము వ్రాసి యియ్యఁగలను.

ఇప్పుడు తండ్రియాజ్ఞ నుజ్జయినికిఁ బోవుచున్నవాఁడ. యీ కృతఘ్నునిఁ బరిజన ప్రసంగమునందైన స్మరింపుచుండవలయును. బ్రతికియుండిన నెప్పటికైన వెండియు దేవీ చరణారవింద వదన సుఖుంబనుభవించువాఁడ, మఱియు మహాశ్వేతా పదపద్మములకు శిరంబున మ్రొక్కువాఁడ మదలేఖ సేమమడిగితిని తమాలికనుఁ గౌఁగిలించు కొంటిని.

అని యిట్లుత్తరమువ్రాసి మడిచి యీ పత్రికం గేయూరకముఖముగాఁ గాదంబరి కందింపుమని మేఘనాథునితోఁ జెప్పుచు, వైశంపాయనుని స్కంథావారముతో మెల్లగా రమ్మని నియమించి తానతి జనంబున నింద్రాయుధ మెక్కి వారువపురౌతులు సేవింప కతిపయ ప్రయాణముల నుజ్జయినికిఁ బోయెను.

ఆకస్మికముగా నతండు వచ్చుటచేఁ బౌరులు సంభ్రాంతులై సంతసించుచు నెదురువచ్చి నమస్కరింపుచుండఁ గైకొనుచు నతం