పుట:Kashi-Majili-Kathalu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

కాదంబరి


దేవా! మదలేఖ యిట్లు విజ్ఞాపన జేయుచున్నది. ప్రధమదశ౯న ప్రీతిచేఁ బత్రలేఖ నిందుంచి వెళ్ళమని కాదంబరి కోరుచున్నది. వెనుక నంపఁగలదు దేవర చిత్తమేమనవుఁడు రాజనందనుఁడు కేయూరకా! మాపత్రలేఖ ధన్యురాలు. దుర్లభమైన దేవీప్రసాదమునకుఁ బాత్రురాలగుచున్నది. అట్లే యుంచుకొండని పలుకుచుఁ నామెను విడిచి తురగ మెక్కి యతివేగముగా సేనా నివేశమునకుఁ బోయెను.

అంతకుముందు తండ్రియొద్దనుండివచ్చి యున్న లేఖావాహకుం జూచి యీరాజపుత్రుఁడు దూరమునందుండియే గురుతుపట్టి యోరీ! మహరాజు కుశలుఁడే అంబకు భద్రమా? రాష్ట్రమంతయు సుఖముగా యున్నదా? యని యడిగినవాఁడును వినమ్రుఁడై చిత్తము చిత్తమని పలుకుచుఁ దన చేతనున్న పత్రికాద్వయ మతని కందిచ్చెను. అతండా పత్రిక విప్పి యిట్లు చదివెను.

స్వస్తిశ్రీ మహారాజాధిరాజ! తారాపీడమహారాజ మార్తాండుఁడు శ్రీమంతుఁ జంద్రాపీడు నుత్తమాంగమున ముద్దిడుకొనుచు వ్రాయునది.

ప్రజలు సుఖులై యున్నవారు. నీవు దిగ్విజయ యాత్రకుఁబోయి చిరకాలమయినది. నిన్నుఁ జూచుటకు మాహృదయము మిక్కిలి యుత్కంఠ నొందుచున్నది. నీతల్లియు నంతఃపురకాంతలతోఁ గూడ గృశించియున్నది. యించుక జాగుసేయక యీపత్రికం జదివి ముగించిన సమయమే ప్రయాణకాలముగాఁ జేసికొని రావలయును.

శుకనాసుఁడు వ్రాసిన రెండవపత్రికలోఁగూడ నట్లేయున్నది. వైశంపాయనుఁడు సైతమట్టి యథ౯ముతోఁ దనకును వచ్చిన యుత్తరముల నతనికిఁ జూపెను.

అప్పుడు చంద్రాపీడుఁడు మిక్కిలి తొందరపడుచు వెంటనే ప్రయాణభేరి గొట్టింప నాజ్ఞాపించెను. మేఘనాథుఁడను సేనాధిపతినిజేరి