పుట:Kashi-Majili-Kathalu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

99


నిన్నుఁజూచుటకు నాహృదయ మిచ్చగించుచున్నది. అదియునుం గాక భవదీయస్మేరానన విలాసముల స్మరించుచుఁ గాదంబరి యస్వస్థి శరీరయైయున్నది. కావునఁ బునద౯శ౯న గౌరవంబున నామెను సన్మానింపఁగోరుచున్నాను. ఇట్టిసందేశ మనుచితమైనను నీసుజనత్వమే మాకిట్టి ప్రాగల్భమును గలుగఁ జేయుచున్నది. ఇదిగో కాదంబరి నీకర్పించిన శేషాహారమును దల్పంబున మరచిపోయితివి. దీనిం బంపితిఁ గైకొనవలయునని తదీయసందేశ మెఱిగించుచుఁ గాదంబరిచే నంపఁబడిన బిసతంతువులచేఁ గట్టఁబడియున్న తామరాకు దొన్నె నతనియెదుట విప్పి యందభిజ్ఞానముగా నుంచఁబడిన యాకులును, బోకలును, కర్పూరమును మృగదామోద మనోహరం బగు చందన విలేపనంబునుం దీసి రాజకుమారున కర్పించెను.

అప్పుడు చంద్రాపీడుండును ఆహా! నాభాగ్యము పరిజనకథల యం దైన స్మరింపఁదగని నన్నుఁ గాదంబరి మిక్కిలి గౌరవింపుచున్నది. ఇదియంతయు మహాశ్వేతయొక్క పాదసేవవలనఁ గలిగిన ఫలమని పలుకుచు నావస్తువుల నాదరముతో గ్రహించి వామకరంబున నతని బుజము బట్టికొని రాజలోకమునెల్ల విడిచి మెల్లగా గంధమాదనమను నేనుఁగను జూడఁబోయెను. అందొకింతకాలము నిలిచి యటనుండి వాజశాలకుఁ బోయి యందలిగుఱ్ఱములు బరీక్షించుచు నింద్రాయుధపృష్ఠభాగమునందలి యవకుంఠనపటం బొకింత జారుటయు సవరించుచుఁ దన్ముఖంబున దృష్టినిరోధముగా వ్రేలాడుచున్న కేసరముల నెగదువ్వుచు నమ్మందిర దారువునకుఁ జేరఁబడి కౌతుకముతో నిట్లనియె.

కేయూరకా! నేను వచ్చిన తరువాత నయ్యంతఃపురమున యేమిజరిగినది? కాదంబరి యావాసరమెట్లుగడపినది? మహాశ్వేత యేమిజేసినది? మదలేఖ యేమిభావించినది? నన్నుగుఱించి యంతః