పుట:Kashi-Majili-Kathalu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కాదంబరి

తన్నుఁజూచి మ్రొక్కు చున్న రాజలోకమును మన్నించుచు నెదురువచ్చిన వైశంపాయనునిఁ గౌఁగలించుకొని పత్రలేఖ నాదరించి లోపలిభవనమును బ్రవేశించి యేకాంతముగాఁ బత్రలేఖ వినుచుండ వైశంపాయనునితోఁ దాను జూచివచ్చిన విశేషములన్నియుఁ జెప్పుచుఁ దత్కధాలాంములతోడనే యారాత్రి సుఖముగా వెళ్ళించెను.

మఱునాఁడుదయకాలమున రాజపుత్రుఁడు సభాభవనమలంకరించి కాదంబరినే థ్యానించుచుండ నంతలో ద్వారపాలుని వెంట వచ్చుచునన కేయూరకునిఁ జూచెను. అతఁడు దూరమునుండియే మౌళిచుంబితధరాతలుండై నమస్కారము గావించుటయుఁ రాజపుత్రుండోహోహో! గంధర్వపుత్రా! రమ్ము రమ్ము. అని పలుకుచుఁ జేతులు సాచి గాఢాలింగనము జేసి తనసమీపమందే కూర్చుండఁ బెట్టుకొని వత్సా! పరివారయుక్తముగాఁ గాదంబరి సుఖి యైయున్నదా? మహాశ్వేతకు భద్రమా! అని యడిగిన నతం డిట్లనియె.

దేవా! అందఱును సుఖులై యున్నారు. కాదంబరి యంజలి వట్టి దేవర నర్చించుచున్నది. మహాశ్వేతయు కుశలవాక్యపూర్వకముగ నమస్కరించుచున్నది. మదలేఖయుఁ దమాలికయుఁ బాదప్రణామ పూర్వకముగా నారాధించుచున్నారు మఱియు మహాశ్వేత దేవర కిట్లు విన్నవింపుచున్నది నీవెవ్వరికిఁ జక్షుర్గోచరుఁడ వగుచుంటివో వారు ధన్యులు. నీసమక్షమునఁ జంద్రకిరణములవలెఁ జల్లనైననీ గుణములు వియోగమందుష్ణకర కిరణములై బాధించుచున్నవి. ఇందలి జనంబులు నిన్నటిదివసంబు సమకితోదయవాసరంబువోలె స్మరించుచున్నారు. నీచే విడువబడిన యీగంధర్వరాజనగరంబు విని వృత్త మహోత్సవమైనదిగాఁ దోచుచున్నది. నన్ను సకల సంగపరిత్యాగురాలని యెఱుంగుదువుగాదా? అయిన నకారణబంథుఁడవగు