పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కాశీమజిలీకథలు - మూడవభాగము

యాచారములన్నియు దెలిసికొని రహస్యముగా నాతోలుజింక గుఱించి తర్కింపు చుండెను.

అతండొకనాడు ప్రాతఃకాలంబున నొకవీధింబడి పోవుచుండ నంత్యజుం డొకండు చర్మములను గావడివైచుకొని మోసుకొనివచ్చుచు నెదురుపడిన బండినిలిపి తన వాడుక ప్రకార మాకావడి దింపించి యాచర్మము లన్నియు బరీక్షింప నందా తోలుజింక కనంబడినది దానియందున్న లిపి యాదేశస్థులకు దెలియదు. కావున దాని మహత్యమెవ్వరికిని బోధపడినదికాదు. ఆ జింకం జూచి అతం డాత్మగతంబున సంతసము పట్టజాలక గంతువై చి యోరీ! యీతో లెంతకు గొంటివని వానినడిగెను.

వాడు అయ్యా! ఇది యేమిటికి నుపయోగములేదు. ఈ చర్మములపైన గొసరుగా దీసికొంటి మీకు గావలసినచో మీయిచ్చవచ్చిన సొమ్మిచ్చి పుచ్చుకొనుడని చెప్పెను.

ఆమాటలకు సంతసించుచు గందర్పుడు తనవ్రేలి యుంగరమొకటి పారితోషికముగా వానికిచ్చి యాజింకం బుచ్చుకొని యింతిం తనరాని సంతసముతో నప్పుడే యింటికివచ్చి యాత్మగతంబున నిట్లు తలంచె.

ఈ దేశమున జీవహింస కించుకయు వెరువరు స్త్రీలందఱు విద్యావతు లగుటచే సాహసము మెండు. చట్టములు వేనవేలు ఇట్టిదేశమున నివసియించుట బహుకష్టము. అదియునుంగాక యీరాజపుత్రిక నాకు జీవముపోసినది. ఆమె అభిప్రాయం నన్ను బెండ్లియాడవలయునని ఉన్నట్లు తోచుచున్నది దాని కొడంబడనిచో చండికవలెచే చేయునేమో! ఈదేశప్రజలనెవ్యరు నమ్మగలరు? కావున నిప్పుడే దేశము నుండిపోవుటయే ఉచితము విదేశయాత్రవలన మొగము మొత్తినది. భరతఖండము నందున్న వింతలనే చూచి అంతటితో దృప్తింబొంది యింటికిబోయెదనని నిశ్చయించి యామఱునాడుదయమున రహస్యముగా నాజింకను బూరించుకొని యెక్కి, మరద్రిప్పి యప్పురంబున కెగసిపోయెను.

అటనుండి పశ్చిమాభిముఖంబై యరిగి యరిగి యెద్దియేని వింత పట్టణము కాన్పించినచో బై నుండియే చూచుచు గ్రమ్మరం జనిచని పశ్చిమసముద్రతీరంబు వరకుం బోయెను. అప్పుడు సముద్రములోనున్న ద్వీపములంజూడ వేడుక బొడముటయు హనుమంతుండువోలె నా సముద్రము మీదుగా నరుగుటయు గొంతదూరము పోవువరకు నతని కేమూలంజూచినను మహార్ణవమేకాని మఱియేమియుంగనంబడమి డెందము వికలమైనది. ఇంతలో సూర్యుడస్తమించెను. నాటి దివసంబు పూర్ణిమ అగుటచే జంద్రకిరణంబు లంభః కణంబుల బ్రతిఫలించి వజ్రమువలె మెరయుచుండ రేయెండ బ్రహ్మాండకరంబునకు సుద్ద బూసిన వాని భాసల గన నతనికి దిగ్భ్రమయై వచ్చినదారిం బోవలయునని తలంచియు దెలియక నలుగడలు గ్రుమ్మరుచు గొంత