పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చండిక కథ

93

క్కువముగా దిరుగా వత్తుననుకొని మజ్జననీజనకులకు శోకోపశమనము గావింపుచుందువు కాబోలు! సుభద్రా! నన్ను భర్తగానెంచి ప్రాణసంకటమునకైన నొప్పుకొని చర్మకురంగం బిచ్చితివి. నీవైన వలదని వారించినచో నీయాపద రాకపోవునే! ఇక నిన్ను జూచుభాగ్య మీజన్మమున నాకు లేదని అనేకప్రకారముల నాత్మీయులం దలంచుకొని వెక్కి వెక్కి యేడ్చుచున్నంతలో శాస్త్రజన్యమైన వివేకంబు హృదయంబున దోప, సీ! దేహపాంతంబునకు వగచుట మూర్ఖతగదా.

శ్లో॥ ఏతస్మాద్విరమేన్ద్రియార్ధగహనా దయాసకాదాశ్రయ
     శ్రేయోమార్గ మశేషదుఃఖశమన వ్యాపారదక్షం క్షణాత్
     స్వాత్మిభావ ముపైహి, సంత్యజ కల్లోలలో లాంగతిం
     మాభూయో భజ భంగురాం భవరతిం చేతః ప్రసీధాధునా.

చిత్తమా! అత్యంతదుఃఖప్రదమైన విషయాశక్తిని విడువుమా! దుఃఖశూన్యమైన మోక్షమార్గము నాశ్రయించు స్వరూపానుసంధానమును బొందుము. చాంచల్యమును విడువుము. సంసారాశక్తి నేవగించి ప్రసన్నవగుము అని మానసబోధంబు గావించుకొని

శ్లో॥ మహేశ్వ రేవా జగతామధీశ్వరె జనార్దనేనా జగదంతరాత్మని
     నవస్తుభేదపతిఁతిపత్తిరస్తిమే తథాపిభక్తిస్తరుణేందుశేఖరె ॥

జగద్దేతుభూతులగు హరిహరులయందు సమానప్రతిపత్తియున్నను నారాజకుమారుడు భక్తిజనవశంకరుండైన శంకరుని ధ్యానించుచు దనశిరంబా యురిత్రాటం దగిలించెను. అప్పుడు రాజకింకరులా త్రాడు ముడి బిగియింపవచ్చునా? అనిదాపుననున్న అధికారి నడిగిరి అతండాజ్ఞ యియ్యవలయునని తలంచుచుండ అంతలో నిరువురు రాజభటులు బరుగిడి వచ్చుచు నురిదీయవలదు వలదని కేకలు వేసిరి. ఆకేకలు విని యా అధికారి వారలదెస జూచుచుండ నింతలో వారు సమీపించి రాజముద్రాంకితమైన పత్రికనొకదానిం జేతికిచ్చితిరి దానిం చదువుకొని యాఅధికారి వెరఁగుపడుచు నోహో! వీని కింకను నాయుశ్శేషమున్నది. వీనివెంటనే రాజసభకు దీసికొనిరమ్మని శాసనంబిచ్చిరి. కావున వెండియుం బండి యెక్కించి గొనిపొండని యాకింకరుల కాజ్ఞాపించెను.

అప్పుడా కింకరు లతని నుఱిత్రాటనుండి తప్పించి బండియెక్కించి వెండియు రాజసభకు దీసికొనిపోవుచు నాజ్ఞాపత్రికలం దెచ్చినవారిఁ జూచి సభలో నేమి వింతలు పుట్టినవి. వీని మరల దీసికొనిరమ్మనుటకు గారణంబేమని అడిగిన వారిట్లనిరి.

రాజుగా రితనికి నురిశిక్ష విధించి అంతఃపురమునకు బోయి తనపుత్రికతో సభావృత్తాంతములం జెప్పుచు నీతని యుఱిశిక్షతెఱం గెఱింగించి బాలా! అది యేమియో కాని వానికి శిక్ష విధించినది మొదలు నాహృదయుమున భీతి బొడముచున్నది. యిది