పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

కాశీమజిలీకథలు - మూడవభాగము

వారును అతని దీవించుచుఁ గ్రొత్తగాఁ జూడక పూర్వపురీతినే మాటాడం దొడంగిరి. అట్లు తల్లిదండ్రులు నన్నదమ్ములు బంధువులు మిత్రులు మొదలగు వారెల్ల తన్ను గ్రొత్తగాఁ జూడక పాతవానితో మాట్లాడి నట్లు మాట్లాడుచుండుట నతండు మిక్కిలి విస్మయము చెందుచు వారందఱు తన్నవమానించునట్లు తలంచి యీర్ష్యజనింప సీ? వీరిని నేను మాత్రము పల్కరించనేల? నేను వేశ్యాలోలుండని కాబోలు వీరు నన్ను మన్నించిరి కారు ఎల్లకాలము నొక్కరుండొక్క రీతినుండునా? ఇప్పుడు నాకును వేరొకచోట రాజ్యమున్నదని తెలిసినచో వీరునన్ను మిక్కిలి గారవింతురు కానిమ్ము నాకేమియు లోపము లేదుకదా! సునీతి వ్యాపార మెట్లున్నదిమో చూచి నాత్రోవఁబట్టి నేను బోయెదనని నిశ్చయించి మగుడు సమయంబున తల్లి వచ్చి వత్సా! నేడిచ్చటి కకాలమున వచ్చితివేల? దానధర్మములు చేయలేదా యేమి? వంటయైనది భుజించి పొమ్మని పలికెను.

ఆ మాటలు విని పెక్కుతెరంగుల శంకించుకొనుచు దల్లి కేమియు నుత్తరము చెప్పకయే వడిగా సునీతి మేడకుబోయెను.

అట్టి సమయమున ఆచిన్నది మాయాజయభద్రునితోఁ బీటలపై గూర్చుండి యొక బ్రాహ్మణునికి బాదములు గడుగుచున్నది. జయభద్రుడు ద్వారము దాటి లోపల బ్రవేశించు నంతలో బీటమీద నున్న అతం డదృశ్యుడయ్యెను.

వస్తుపదానకాలములో బీటమీద మగనిం గానక సునీతి నలుమూలలు చూచి నంత ద్వారదేశమందు నిలువంబడి యున్న జయభద్రుడు గనంబడియెను.

అతనిం జూచి యాచిన్నది. అయ్యో! ఇది యేమి చిత్రము నాపీటమీదనుండి అచ్చటి కెట్లు పోయిరి? ఇది గాంధర్వమువలె నున్నదియే అని విస్మయమందుచుఁ దానులేచి జయభద్రునికడ కరిగి అతని చేయిపట్టుకొని ప్రాణేశ్వరా? బ్రాహ్మణునికిఁ బాదములు గడిగి వస్తు వొసంగక నడుమ లేచి యింతలో నిచ్చటికి వచ్చితిరేల? అట్లు చేయుట శాస్త్రదూష్యము కాదా! నాయపరాధ మెద్దియేని గణించి కోపముతో నిట్లు వచ్చితిరా? క్షమింపుడు వేగమరండని చేయి పట్టుకొని లాగగా జూచి జయభద్రు డాసునీతి నంతకుమున్ను జూచి యెఱుగడు కావున విస్మయాకులహృదయుండయి యేమియుం దోచక యామెతో నిట్లనియె.

జవ్వనీ! నీ వెవ్వతెవు? నేనెవ్వడనుకొని ఇట్లనుచుంటివి? ఇంతకుముం దెన్నడేని నన్ను జూచియుంటివా? నీ మాట లేమియు నా కర్థములు కావు ముందుగా నీ యుదంతము జెప్పుమని పలుకగా నాకలకియు బరిహాసమున కట్లనుచున్న వాడని నిశ్చయించి నవ్వుచు నిట్లనియె.

ప్రాణేశ్వరా మీకు కుంతిభోజుని యేడవకుమారులు. మీపేరు జయభద్రుడు. నాపేరు సునీతి నేను మీకు భార్యను. మిమ్ము బెద్దతడవులబట్టి చూచుచుంటిని. ముందటి జన్మములో గూడ విడువను. ఇదియే మనకుగల బాంధవ్యము. ఈమాటు నా మాట లర్దమైనవియా? ఇది పరిహాసకాలముకాదు. పాపము బ్రాహ్మణుడు చేయి చాపి పీట