పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

61

జెఱసాలలో బెట్టించితిని అన్నన్నా! యెంత తెలియకపోయితిని. ఇప్పుడు వీని నేమి చేసినను దోసములేదు. సభకు బోయినప్పుడు మే మొండొరులము సౌహార్ద్రసూచకముగా హస్తగ్రహణము చేయుట వాడుకయున్నది. గదా! ఈదినమున వానికి నెడమచేయనందిచ్చి కుడిచేతితో ఆడిదము బెఱికి వానితల దెగనరికెద దానితో నాయహంకారము వాయునని యిరువురు నూహించిరి.

వారిచర్యలం గనిపెట్టుచు జయభద్రుండు ఆనాడు పెందలకడ భుజించి సభకు వచ్చెను. సభ్యులందఱు యథాకాలమున సభకువచ్చి వారివారిస్థానముల గూర్చుండిరి

అప్పుడు వాడుకప్రకారము ముందుగా గుణవర్మ సభకువచ్చి తనపీఠముపై గూర్పుండ ధనవర్మరాక నిరీక్షించియుండెను. అతని అప్పటి యాకారము ముఖవైఖరినిజూచి సభ్యులందఱు వెరగుపడజొచ్చిరి.

ఇంతలో ధనవర్మయు నశ్వారూఢుండై పెక్కండ్ర పరిచారకులతో నాయాస్థానమునకు వచ్చెను.

అప్పుడందున్న వారందఱు లేచిరి గుణవర్మయు బీఠమునుండి లేచి రెండు మూఁడడుగు లెదురుగా నడిచి యతనికి నెడమచేయి అందిచ్చెను దాని కత డించుక శంకించుచు నెడమచేతితోఁ బట్టుకొని రహస్యముగా మొలలో దాచియుంచిన అడిదము వడిగాఁ గుడిచేతితోఁ బెఱికి చెడుగా! చావుమని మెడమీదఁవేసి తలనఱికెను. గుణవర్మయు నట్టి ప్రయత్నముతో నుండుటఁబట్టి ధనవర్మవలెనే యాసమయమున దక్షిణహస్తముతో వాలుబెఱికి ధనవర్మ తలనరికెను.

ఇరువుర వ్రేటులు నేకక్షణమున నొండొరుల కంఠంబులంబడుటచే వారిద్దరు నొకసారి స్వర్గమునకు నిర్గమించి అచ్చటం గూడ రంభకొరకు జగడమాడఁ దొడంగిరి.

వారిచిత్రవధఁ జూచి సభాసదులందఱు నాశ్చర్యమందుచు నుభయపక్షములవారు నొండొరుల గలహింపం దొడంగిరి. అప్పుడందఱును వారించి జయభద్రుడుఁ ఆక్షణమునందే వారితండ్రులగు వీరపాల శూరపాలురకు వర్తమానము పంపుటయు దన్మూలమున వారిరువురు సేనలం గూర్చుకొని యొండొరులు ఘోరముగాఁ బోరి చివర కిరువురును వీరస్వర్గమునొందిరి.

ఆహా! జయభద్రుని బుద్దిబల మెందర శత్రువుల నిర్మూలము చేసినదో చూడుము. ఈ లోపలనే జయభద్రుఁడు సేనలనెల్ల లోబఱచుకొని యామంత్రపాలుని భార్యతోఁగూడఁ జెఱ విడిపించి యాదినమునందే తిరుగ సింహాసన మెక్కించెను. అప్పుడు ప్రజలందరు మిక్కిలి సంతసించి అతనియందు మిగుల విశ్వాసము గలవారైరి.

మఱియు వీరపాల శూరపాలురు సంగరములో హతులైరను మాటవిని జయభద్రుఁడు మంత్రపాలసమేతుఁడై యాయిరువుర దేశములకుఁ బోయి వానిం