పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కాశీమజిలీకథలు - మూడవభాగము

నీకు మిత్రుడుగానున్న గుణవర్మ స్వాధీనములోనే యున్నది. అతండు నిత్యము ప్రచ్ఛన్నముగా నాచిన్నదానితో యథేష్టసౌఖ్యంబు లనుభవించుచునే యున్నాడు. అదేమియు నీ వెరుంగక అమాయకపు మాటలు చెప్పుచుంటివి. వెల్లడియైనచో నీవూరకొనవనియే ఆతని తాత్పర్యము! నేను చెప్పినమాట నీకు నమ్మకము లేనిచో బ్రత్యక్ష్యముగా జూపెదను అచిన్ దాని ప్రకృతి నీయొద్దనున్నదిగదా! దానింబట్టి నీవు గురుతు జూడవచ్చునని పలుకగా ధనవర్మయెట్టెట్టూ! మరల జెప్పుము! నీవు జెప్పిన విషయము నాకన్నులకు జూపెదవా? అట్లు చూపితివేని నాయర్ధరాజ్య మిచ్చెదను. గుణవర్మ నాముందర నెంతటివాడు? వాని దేశముపై నేను ఋణమిచ్చితిని. అట్లు జరిగినచో తృటిలో నంతకపురి కనుపనా! నా కావిశేష మెప్పుడు చూపెదనని గట్టిగా నిర్భంధించెను.

అప్పుడు జయభద్రుడు ఆలోచించి నాలుగుదినములు వ్యవధిగోరెను. మఱియు గుణవర్మయొద్దగూడ నెద్దియో ప్రసంగముమీద హైమవతి వృత్తాంతమును గుఱించి వితర్కము వచ్చినంత జయభద్రుడు సంతసించుచు ధనవర్మతో జెప్పినట్లు చెప్పి అతనికి రోషమెక్కించెను.

ఆహా బుద్ధికిసాధ్యము కాని పని యేదియును లేదుకదా!

అరిదివిలుకాని యుజ్వల, శర మొక్కని జంపు తప్పి చనినం జనునే
నేర్పరియైనవాని స్ఫురణము పగవారలెల్ల బొలియించు దుదిన్.

జయభద్రు డొకనాడు రాత్రి తనయుద్యమమున కనుగుణమగు నొకసౌధము చక్కగా నలంకరింప చేసి అందు హంసతూలికాతల్పంబున దివ్యమాల్యాలంకారశోభితయైన హైమవతిని గూర్చుండ బెట్టి వింతవింతలుగా బూవుదండలు గట్టుటయు ఆకుమడుపులు జుట్టుటయు మొదలగు విన్నాణపు పనులు చేయించుచుండెను.

ఇంతలో ధనవర్మ గుణవర్మలకు నారాత్రియే తాను జెప్పిన విషయమును జూపుటకు నచ్చటికిరమ్మని సంకేత మేర్పఱచి యుండుటంచేసి చీకటిలో వెదకికొనుచు ముందుగా నచ్చటికి ధనవర్మ వచ్చెను.

జయభద్రుడు వానిచేయి పట్టుకొని మెల్లమెల్లగా నామేడమీదికి దీసికొనిపోయి గది గవాక్షమునుండి హైమవతిం జూపి మిత్రమా! హైమవతి అదుగో! చూడుము. నీవద్ద చిత్రములో నున్నట్లున్నదియో లేదో అరయుము అనిచూపగా జూచి ధనవర్మ తనచేతనున్న చిత్రఫలకమును చూచి దానించూచి తలయూచుచు గుణవర్మ దలంచుకొని వెఱచుచు ఆహా! విధిసృష్టి యెంత చోద్యముగా నున్నది. ఈలాటిపాటలగంధిని పొందనివాని జన్మమేల? సీ? దుర్మార్గుడైన గుణవర్మ నాకడ్డమువచ్చెనే. సరియే వానిపని రేపుదయమున బట్టెదనని యనేకప్రకారముల నవరసములు ... ... ... ... నెట్టకేలకు జయభద్రుం చూచి మిత్రమా! నీవుచెప్పిన మాటలు వింటిని. హైమవతిం జూపితివి. కన్నుల కలిమిసార్ధక మైనది. కానిమ్ము