పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5]

హైమవతికథ

41

నొకచోట నిలువంబడి వెనుకటి స్థితి తలంచుకొని నంత నాస్వాంతమున నిట్లు తోచినది.

ఏమేమీ! ఈ మహారణ్యమునకు నేనెప్పుడు వచ్చితిని! నిజముగా వచ్చితినా? లేదు. ఇదికల. కలలో సూర్యుడు కనంబడునా! నేనెవ్వతెను? హైమవతినే! మా వారందరు నెచ్చటికిబోయిరి? అయ్యో! నాకీరాత్రి బెండ్లి చేయుదురే. ఇదిగో! నా మేనంతయు శుభలక్షణములు గనంబడుచున్నవి. మాయంతఃపుర మెందుబోయినది. ఆ! తెలిసినది. భ్రాంతిపడి మఱియొకలాగునఁ దలంచుచుంటిని. యిది స్వప్నములో స్వప్నము. అరణ్యములోఁ గ్రుమ్మరుచున్నట్లు యింతకుముందు బెక్కుసారులు కలవచ్చినది. కాకున్న నేనీ కారడవిలోని కెట్లురాఁగలను? గాదు కాదు. మరల భ్రమసితిని. రాత్రి గుర్రపుదొంగలు నన్నుఁ తీసికొనివచ్చిరి. స్వప్నముకాదు. నిజమువలెనే తోచుచున్నది కటాకటా! యెట్టియాపద పాల్పడితిని. నన్నీ అరణ్యములో రక్షించువారెవ్వరు? నిష్కారణముగా నాచక్కని రూపమిక్కడి మృగముల పాలు చేయవలసివచ్చెనే. హా విధీ! నా బ్రతుకు నీకెంత బరువైనదిరా? నేను బూర్వజన్మమున నెట్టిపాపము గావించితిని. ఇట్టి దారుణకష్టములను గుడిపించుచుంటివే; యెప్పుడైనను గరుణించి యుద్ధరింపవా! దీనశరణ్యా! పరమేశ్వరా! కరుణాంతరంగితాంతరంగా అని అనేక ప్రకారము లాయడవి అంతయుఁ బ్రతిధ్వనులిచ్చు నట్లు యెలుగెత్తి ఏడువఁదొడంగితిని.

నాయరణ్యరోదనము వినువారెవ్వరు? నాకు నేను యుపశమించుకొని మరల ధైర్య మవలంబించి యొకదారిఁబడి యెచ్చటికో పోవుచుండ నాదండనున్న యొక పొదలోనున్న పులి నన్నుఁజూచి గాండ్రుమని అరచినది.

ఆ అరపుతోడ నా గుండె పగిలి ప్రాణము లెగిరిపోయిన నేలంబడి మూర్ఛిల్లితిని. ఆ పులి మొదట నన్ను మ్రింగినదే అనుకుంటిని. జామువఱకు నాకుఁ దెలివి వచ్చినదిగాదు. అప్పుడెచ్చట దాగియున్నవియో మొండిప్రాణములు తిరిగి శరీరములోఁ బ్రవేశించినవి. కన్నులు దెఱచి మెల్లగా లేచిచూచినంత నా వ్యాఘ్ర మచ్చట నూచదెబ్బతిని చచ్చియున్నది.

అప్పుడు నేను విస్మయసాగరములో నీదులాడుచు నాయూచవైచినవా రెవ్వరో అని పలుమూలలు బరికించుచున్నంత నొకదెసనుండి నల్లనిముఖమును చిఱువెండ్రుకలు గోరపండ్లు మిట్టగ్రుడ్డులుంగలిగి విల్లమ్ముల ధరించి యెవ్వఁడో వచ్చుచున్నట్లు కనంబడియెను.

వానిని మొదట నొకమృగమే అనుకొంటిని. ధనుర్బాణధారణంబునంజేసి మనుష్యజాతిలోనివాఁడని యూహించితిని.

నన్నుఁ బులివాఁత దప్పించిన భగవంతుని సంకల్ప మీతనిచేత జిక్కఁజేయుటకు గాబోలు, నడవిబోయనకు దయాపత్యములుండవు వీడు తప్పక నన్ను సంహరించును. కానిమ్ము ఎన్నిటికి విచారింతును? చావునకుఁ దెగించియున్న నన్నెవ