పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

కాశీమజిలీకథలు - మూడవభాగము

కావింపఁ గాదనువారెవ్వరు? స్త్రీలకు పునర్వివాహము శాస్త్రసమ్మతమైనదా? ఇట్టి యాచారమెందైన గలదా? సరివారువినిన నెంత యాక్షేపింతురు. నేనల్ల నాటి రాత్రి చర్యలేమియో యనుకొంటొని గాని యిట్లని దెలిసినచో బరమేశ్వరుడు వరించిన సమ్మతింతునా? ఎంత ! ప్రమాదము దాటినది. దైవమే నాకీయుపకృతి కావించెను. ఇక చాలు నామువ్వురిలో నన్నెవ్వనికిచ్చి పెండ్లి చేసితివో చెప్పుము. వానినే చక్రవర్తిగా భావించుకొనెదను. అతండే నా జీవితేశ్వరుడు. చక్రవర్తులుమాత్రము మెల్లకాల మీపుడమి స్థిరులయియుందురా యేమి? నాలుగుదినములు నెట్లనో కాలక్షేపము జేసికొనిపోవుట కింతయేల? అని యాక్షేపించు పుత్రికమాటలు విని యాధాత్రీపతి సిగ్గుపడుచు నొక్కొండ ధ్యానించుచు నిట్లనియె.

అమ్మా ! నీవన్నమాటట యదార్థము. నా బుద్దియే ప్రమాదము నొందినది' గతమునకు వగచినం బ్రయోజనము లేదుకదా? రాత్రి చీకటిలో లేపుటచే నా మువ్వురిలో నెవ్వరికిచ్చితినో గుఱుతుబట్టజాలను అప్పుడట్టి యవసరము లేకపోయినది. ఆనిడ్కువమిప్పుడు వారిని రప్పించి వారివలననే దెలిసికొనియెదనని పలుకుచు చెరసాలనుండి సగౌరవముగా వారిని రావించి జాంబూనదాంబరాభరణాదు లొసంగి యల్లన నిట్లనియె.

ఆర్యులారా! మీశాంతస్వభావములఁ దెలిసికొనలేక నిష్కారణముగా మిమ్ము బాధించిన నాయపరాధము సైచి మన్నింపవేడెద మొన్నటిరాత్రి దేవాలయములో మీలో నొకనికి నాపుత్రికను వివాహము గావించితిని కావున నతండెవ్వడో తెలుపవలయును. నాకూతురాతనినే జీవిత నిబంధమునిగా జేసికొని పరిచర్యఁ గావింపఁగలదని నుడివిన వాండ్రు వాడుకమాటలుదప్ప మరేమియుఁ బ్రత్యుత్తర మీయరయిరి.

తరువాత నాక్షితిపతి చతురోపాయంబుల వారిం దర్కించెను గాలి ప్రయోజనమేమియు లేకపోయినది దాన విసిగి యమ్మానపతి వారినప్పుడే విడచుటయు నందు నిలువక వారెందేనిం బోయిరి పిమ్మట నమ్మాలతియు నయ్యో! ఇదియేమి కర్మము. ఇప్పుడేమి చేయుదాన స్త్రీలకు పతియేదైవము. పతితోడిదె గతి. పతి యెవ్వడో తెలియక యతం డడవులపాలయి గ్రుమ్మరుచుండ నింటికడ దివ్య భోగంబులందుట నాతికి నీతియా? సీత దమయంతి లోనగుసతులు సుఖంబుల విడిచి కష్టంబుల లెక్కగొనక పతులవెంట నడవులఁ గ్రుమ్మరలేదా? వారికన్న నేనెక్కుడు దాననా? నేనును ఆయున్మత్తులవెంట గ్రుమ్మరుచుండ నెప్పటికయిన నాగళంబున మంగళసూత్రంబుఁ గట్టినయతండు దెలియబడకుండునా? అదియె కర్జంబని నిశ్చయించి హృదయంబున వైరాగ్యంబు దీపింప తల్లి దండ్రులమాటల పాటింపక, బంధువుల నుడుపుల లెక్క గొనక యొక్కదివసంబున మణిభూషణాంబరముల విడనాడి నారచీర ధరియించి విరాగిణి యనుపేరు పెట్టుకొని రహస్యముగా పురము వెడలి వారిజాడ లరయుచు దేశాటనము జేయఁ దొడంగినది.