పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాలతి కథ

287

నెత్తుకొనిపోయి కోటమాటున నొకచోట నునిచి తుందరిలోదరుఁ డనుకొనినయట్లు చేయుచున్నాడో లేదోయని విమర్శించుటయు వెండియు లోనికిఁ బోయితిని.

భూత - సాధు, తామ్రకేశ, సాధు మంచి యుపకారము జేసితివి. మొదట తుందిలోదరున కేమని యుపదేశించితివి.

తామ్ర - మాలతీరూపముతో కూర్చుండుమని చెప్పితిని. అతండు మదుక్తప్రకారము గూర్చుండి వారు చేయుమనినట్లు చేయుచు వివాహానంతరమున గదిలోనికి బోయెసు. అంతవరకు నేను దాపుననుండి కాపాడుచుంటిని. పిమ్మట నాకోట దాటి మునుపటిచోటున నా చిన్నదానింగానక చింతించుచు నలుమూలలు వెదకివేసరితిని. ఎందును నాసుందరి జాడ గనంబడినదికాదు. అదిలేచి పారిపోయినదనుకొందమన్నను సూర్యోదయమయిన తరువాతగాని నానాతికిఁ దెలివిరాదు. అది దేవమాయయని నిశ్చయించి విచారముతో వచ్చిచుండ నీచెట్టు దాపుననే తుందిలోదరుడు నన్ను గలసి కొనియెను.

భూత - అయ్యో! యెంతమందమతివైతివి ? దానిం దీసికొనివచ్చి యిందుంచి పోయిన నేకొరంతయు లేకపోవునుగదా? తుందిలోదరుడు లోపల నేమిచేసెను. మాలతికథ యెఱుగునేమో యడుగుము.

తామ్ర - ఇదివరకే యడిగితిని. అతండు గదిలో ప్రవేశించి తన్ను పరిహాసమాడవచ్చిన యింద్రదత్తుని మేనిపయిని నఖదంతక్షతంబు బెక్కుడుగా నాటించిన వెరచుచు నతండు దయ్యము దయ్యమోయని యరవబోయిన నోరుమూసి మెదలకుండ పట్టుకొనియెత్తి యొక మహారణ్యమధ్యంబున బారవయిచెనట. మాలతిజాడ యేమియు నెఱుంగనని చెప్పినాడు. స్వామీ! మీయానతి గావింపమికి యీ నికృష్టుల యపరాధముల సయించి మన్నింప వేడుకొనుచున్నారము. దేవయానతి యేమియని పాదంబులం బడినంత భూతరాజు వారి నుపేక్షాభావంబునం జూచుచు నిలువుడు. మీ మాట తరువాత విమర్శింతుమని పలుకుచున్నంతలో తెల్లవారుసమయమగుచుండఁ జూచి యాతండు బలముతోగూడ నటకదలి వేరొక నివాసమున కరిగెను

అంతలో సూర్యోదయమయినది. రాత్రిజరిగిన చర్యలన్నియు వారు మువ్వురు చెట్టుకొమ్మల పయినుండి చూచుచుండిరి. కావుస బ్రొద్దుపొడిచిన కొంత సేపటికి నమ్ముద్దియకు దెలివివచ్చి తొఱ్ఱలోనుండి కదలలేక మొఱ్ఱపెట్టినంతనే యా మువ్వురును బోయి మెల్లగా నామగువను గంపతో నేలకు దింపిరి.

అప్పుడాచిన్నది వారినిజూచి మీరెవ్వరు? నన్నిచ్చటికినేమిటికి దీసికొని వచ్చితిరని యడిగిన నొకండు దైవాయత్తమనియు నొకండు అంతా మహాచిత్రమనియు నొకండెవ్వరికెవ్వరులేరనియు నుత్తరమిచ్చిరి.

ఆమాటలువిని అబ్బోటి అయ్యో! యిది స్వప్నమాయేమి? నిన్నటిరాత్రి మా యింటిలో మావారు నన్ను గౌరీపూజచేయుటకయి యీగంపలో కూర్చుండబెట్టిరే. నన్ను వీరెట్లు దీసికొనివచ్చిరి. నాకు నిద్రపట్టినదా యేమి తరువాత నేమి జరిగినదో