పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

కాశీమజిలీకథలు - మూడవభాగము

ఆచాటింపువిని దేవశర్మ యాహాహా! లోకమంతా విచిత్రముగానే యున్నది. అంతా విచిత్రమే! యంతావిచిత్రమేయని యాశ్చర్యసాగరంబున మునుంగుచు నదిమొదలు “అంతా విచిత్రమే అంతా విచిత్రమే అంతా విచిత్రమే యని పలుకుచు నాయూరను వసియింపక యాదివసముననే వేరొక వీటికిఁ బోయెను.

ఆ పట్టణమందు నడివీధిలో నొక దేవాలయమున్నది. దాని యరుగుమీదఁ దఱచు నావీటిలోని బ్రాహ్మణులందరు పనిలేనిసమయమున వచ్చి కూర్చుండి యిష్టాలాపము లాడికొందురు. దేవశర్మ యాయూరు చేరిన నాలుగుదినములకు నొకనాడు కొందఱు బ్రాహ్మణులు చేరి యిట్లు మాటాడుకొనిరి

రామభట్టు - సోమశేఖరా ! వింటివిరా! మనమిదివరకు దైవయత్నము గాడితోనే వేగుచుంటిమి. పులిమీద పుట్రయనినట్లు యిప్పుడు అంతా విచిత్రంగాడొకడు మనయూరు చేరెనట. వానికిగూడ మనము వారములిచ్చి భోజనము పెట్టవలయునట. ప్రొద్దుట సభాపతి బంపిన పత్రిక నీకు జేరినదా?

సోమశేఖరుడు - నేను గ్రామాంతరమునుండి యింతకుమునుపే వచ్చితిని. అందలివిషయము లేమియో నాకు తెలియవు చెప్పుము.

రామ - నాలుగుదినములక్రిందట నంతావిచిత్రంగాడను వెఱ్ఱివాడొకడు మన యూరు వచ్చి దేవాలయములో వసించెను. వాడు దైవాయత్తముగాడివలెనే యెవ్వరితో నేమియు మాటాడడు నాలుగుదినములనుండి తిండిలేక పడియుండుటఁజూచి నిన్నను సభాపతి తన యింటికి దీసికొనిపోయి భోజనము పెట్టించెనట.

సోమ - సభాపతి మంచిపనియే చేసెను. వానికేమి సభాకట్నముల సొమ్ము ప్రోగుపడినదికదా! తరువాత?

రామ — అబ్బో! ఆమాత్రమా! ఒకనాటికే వానిభార్య సాధించెనట. దైవాయత్తంగాడికివలెనే వీనికిని వంతులు వేసికొని భోజనము పెట్టవలయునని యగ్రహార బ్రాహ్మణుల కందఱికిని పత్రికలు బంపినాడు అట్లు సమ్మతింపననిన వానిని వెలివేయించునట

సోమ - సభాపతి యుత్తరువు కఠినముగానే యున్నది. ఈమాటు తగవు రాకమానదు. ఇదివరకు దైవాయత్తముగాడి విషయమై వచ్చిన తగవు విన్నావా?

రామభట్టు - అదేమి? వినలేదు చెప్పుము.

సోమ - అగ్నిభట్టు, వరుణభట్టులు చరస్థిరరూపమైనతమయాస్తి పంచుకొనుచు నాబ్దికముల నగ్నిభట్టు పెట్టుటకును దైవాయత్తంగాడికి భోజనము వరుణభట్టు పెట్టుటకును మొదట నిర్ణయించుకొనిరట. తరువాత వరుణభట్టు పెండ్లాము తద్దినములు ఏడాదికొకమారు వచ్చునే దైవాయత్తంగాడికి వారమునకు రెండు సారులు భోజనము పెట్టవలయు, దీనిలో మాకు నష్టమున్నదని తగవుపెట్టి మొన్నను దైవాయత్తంగాడిని భోజనమునకుఁ బిలువనిచ్చినదికాదు. అందువలన వాని కాదినమున భోజనము లేకపోయినది. ఆసంగతి సభాపతి విని వరుణభట్టును మందలించుచు