పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(34)

దేవశర్మ అను బ్రాహ్మణుని కథ

273

లున దాటి యింటికిం బోయినది. వెంటనే యావిటుండును చండీకాలయంబుదాటి యెక్కడికేనిం బోయెను.

వారి మాటలచే దచ్చరిత్రమెల్ల వెల్లడియయినది. కావున దేవశర్మ హృదయంబున నయ్యో! నేనిందెవ్వరు నుండరని యిచ్చటికి వచ్చిన నిందును నాకీ పాపచర్యలు కనంబడెనే.

సీ. అయ్యయ్యో యిది యేమియన్యాయమో కాని
              యలసి నేనేమూల నణగియున్న
    పాపకృత్యములె కన్పట్టుచున్నవి కాని
              సుకృతకార్యం బొండు చూడఁబడదు
    వనితలందునఁ బతివ్రతలు లేనెలేరొ
              లోకమంతయును నిట్లేకసరణి
    నొప్పుచున్నదో లేక యూహించి దైవంబు
             కడంది నాకిటు చూపఁదొడఁగెనొక్కో
గీ. ఇంద్రజాలమొక్కొక్క యిది పురాకృత మహా
    పాతకంబొ యనుచుఁ బరితపించి
    యూరిలోనికరిగి యొక్క దేవాగార
    బాహ్యమంటపమునఁ బండె నతడు.

ఆ దినమున నా యూరిలో నొక బ్రాహ్మణుడు సంతర్పణ చేయుచు మధ్యాహ్నకాలంబున గుడిలొనున్న దేవశర్మను భోజనమునకుఁ దీసికొనిపోయెను. బ్రాహ్మణులు భుజించుచు నిట్లు సంభాషించుకొనిరి.

ఒక బ్రాహ్మణుడు - లోకములో భూతములు లేవందురు. చూచితిరా! ఈ బ్రాహ్మణపుత్రికను బట్టిన భూతమెంతదిట్టమయినదో? మొన్నటివరకు నత్తరుణిని వేపినదిగదా?

మరియొకఁడు - చివర కెవరివలన వదలినది?

మొదటియతఁడు - మొన్నను మంచిమాంత్రికుఁ డొకడువచ్చి కుదిర్చెనట. రాత్రి యాచిన్నది యుపహారంబులం గయికొని చండికాలయములోని కొక్కరితయే పోయి యాభూతమునకు బలి యిచ్చి వచ్చినదట. చిత్రమువింటిరా? తెల్లవారువరకు నాభూత మానాతిని బెక్కుచిక్కులుపెట్టి వదలలేక వదలలేక తెల్లవారుముందర వదలి పోయినదట. అప్పటినుండియు నాచిన్నది చక్కగా మాటాడుచున్నది.

మఱియొకడు - భూతములే లేవని వాదించు వారీకథ వినిన నేమందురో?

మొదటివాడు - మఱియొక దృష్టాంతరము చూడుడు, ఆ చిన్నది యెన్నడును తోడులేక వీథిలోనికి బోవుటకు వెరచునది. మంచి గుణవంతురాలు. దానిని జిన్నతనమునుండియు నేనెఱుంగుదును. భూతశక్తికాక యట్టిభీరువు నిన్నవర్ణ