పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

కాశీమజిలీకథలు - మూడవభాగము

కదా! మనకేమి కొదువయని వినయసంపన్నములగు మాటలచే నతని కోపము చల్లార్చెను.

ఆ బ్రాహ్మణుడు దేవశర్మ వినయసంపత్తిం జూచి యేమియు మాటాడక భుజించిన వెనుక రెండవవానితో రహస్యముగా నిట్లనియె. ఆర్యా! యీయిల్లాలి చర్యలుంజూడ, గడు వింతగా గనంబడుచున్నవి. దీనిఁ గులటలలో మొదటిదానిగా తలంచెదను. దీనిటక్కులన్నియు నాయమాయకపు బ్రాహ్మణుడు నిక్కవములని నమ్ముచున్నాడు. నిజమైన పతివ్రత కిట్టినియమములుండవు. కొన్ని దినంబులిందుండి దీని దుండగములు పట్టుకొని మగనికప్పగించి పోవుదమని చెప్పిన నతండును సమ్మతించెను. అట్లిరువురు నాలోచించుకొని వారింటిలో భుజింపక యాయూఱ వేఱొకచోటవసియించి యా ప్రాంతమందే తిరుగుచు నాయింటిగుట్టంతయు గ్రహించి యొకనాడు జాము ప్రొద్దెక్కిన సమయమున నీరుతోడుచున్న దేవశర్మ యొద్దకుం బోయి అయ్యా! మాకు నాలుక యెండిపోవుచున్నది. దూరము నడచివచ్చితిమి. ఇంతదాహము తెచ్చితివేని బ్రతికిపోదుము ఈ నీరు పనికిరాదు. లోనికిబోయి మజ్జిగ తెచ్చియిండని యత్యాతురతగా ప్రార్ధించిన నతడు అయ్యా! దీనికింతగా వేడవలయునా? ఇదిగో, పోయి తృటిలో పుల్ల మజ్జిగ తెచ్చెదనని చెప్పి యాగిలకం గట్టిపెట్టబోయిన వలదు, వలదు, ఆలస్యమగును మేము పట్టుకొనియెదమని సోమభట్టందుకొని యాగిలక లాగుచుండెను.

అప్పుడు దేవశర్మ వేగముగా నింటికింబోయి తలుపులన్నియు మూయబడి యుండుటజూచి భార్య యింటిలో లేదనుకొని యీవలనుండియే తీయగలిగిన గడియ గల యొక తలుపు త్రోసికొని లోపలకుంబోయెను అట్టిసమయమున వంటయింటిలో మిత్రవింద యొకమూల వంటయగుచుండ నాదండ పెద్దపాలిగాపుతో క్రీడించుచుండెను

వెఱవకుము ఇంకను మీదొరవచ్చువేళ గాలేదు. గిలకచప్పుడు వినంబడుచున్నది. అదికట్టి స్నానము చేయునప్పటికి రెండుగడియలు పట్టును. నేను సమయము చెప్పెదనులే. ఈదినము పరదేశులెవ్వరును రాలేదు మనయదృష్టమే నిన్న నేమిటికి వచ్చితివికావు. మంచికూరలు వండియుంచితినిసుమీ! యని పలుకుచు నా నీచునినో కలసియుండ నాదేవశర్మ కన్నులారఁజూచి మాటలువిని యట్టె నిలువంబడ మ్రాన్పడి హా! పాపాత్మురాలా! యెంతటిదానావే? నీకతంబున పెక్కండ్రు బ్రాహ్మణులకు నపవిత్రాన్నము పెట్టి పాపము మూటగట్టికొంటివని తిట్టుచు సీ! యీ సంసారము నాకేటికని రోసి గిరాలున మరలి యా యిల్లు వెడలి “ఎంతచిత్రము! ఎంతచిత్రము!" అని పలుకుచు మఱియేమియు బలుకక యెచ్చోటికేని బోవుచుండెను.

అట్టిసమయమున నాబ్రాహ్మణు లిరువురు నెదురుగావచ్చి ఏమయ్యా! దాహము తెచ్చి యీయక పోవుచున్నావు. వింతలేమయినం గంటివాయని యడిగిన వారి కేమియు నుత్తరమీయక యెంతచిత్రమను మాటయే రామస్మరణగా నాయూరు విడిచి