పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

కాశీమజిలీకథలు - మూడవభాగము

గోపాలుం డత్యంతసంతోషముతో మణిసిద్ధునొద్దకుబోయి తదీయ జపావహనము వరకు నిరీక్షించి పిమ్మట తాను చూచివచ్చిన విగ్రహపువ్రాతలరీతి నెఱింగింపమని వేడిన నయ్యతిచంద్రుండు తలయూచుచు భోజునానంతర మందొకచో కూర్చుండి తద్వృత్తాంతమంతయు నంతఃకరణగోచరముఁ జేసుకొని యక్కథ నిట్లన చెప్పం దొడగెను.

దేవశర్మ యను బ్రాహ్మణుని కథ

ఆంధ్రదేశంబున మణిభద్రమను నగ్రహారంబున దేవశర్మయను బ్రాహ్మనుడు గలడు. అతండు వేదవేదాగంబుల జదివి గృహస్దోచితక్రియల యథావిధిం గావించినమాన్యులలో నుత్తముఁడని పేరుపొందెను ప్రాయమింత మీరినంత సంతానశూన్యుండగుటచే దేవశర్మ హృదయమున వైరాగ్యంబు దీపింప భాగవతాగ్రేసరుండయి హరిభజనము గావింపుచుండును అతనిభార్య మిత్రవింత యనునది.

క. కై సేసి బిడ్డపాపలతో సందడిలేమి నొడలు దొడలుఁ బిరుదిం
    తేసి కుచంబులు మెఱయం గాసుందరి పోతబొమ్మగతిఁ జూపట్టున్.

ఆ బ్రాహ్మణుం డుదయంబునలేచి ప్రాతఃకృత్యంబులు నిర్వర్తించుకొని గృహారామములోనున్న నూతినీరు రెండు యామముల దనుకఁ జెట్లకు బెట్టుచు బాటసారులకు దాహములిచ్చుచు హరిభక్తి వశంవదహృదయుండయి కుతపకాలంబున నింటికివచ్చి దేవతార్చన గావించి భుజించి వెండియుం దోఁకులబోయి సాయంకాలం వరకు నందుండి వచ్చుచుండును. మిత్రవిందయు నింటిలో మఱియెవ్వరును లేమిం జేసి తానే గృహకృత్యములన్నియుం దీర్చుకొని యలంకరించుకొని వంటజేసి పతి యింటికివచ్చినదోడనే పాదంబులుగడిగి శిరంబునం జల్లుకొనుచు నత్యంతప్రీతితో భోజనము పెట్టి యంపుచుండును. భార్యచేయు నుపచారములకు దేవశర్మ మిక్కిలి సంతసించుచు నామెను బతివ్రతాతిలకముగా దలంచుచుండెను.

ఇట్లుండ నొకనాడు వారింటికి నిరువురు బ్రాహ్మణులు బోజనార్ధ మరుదెంచి తలుపు మూసియుండుటచే వాకిటనుండి తలుపుతీయుడని యరచిరి. ఆ మాట విని యాబోటి వచ్చి తలుపుతీసినది. ఆమెం జూచి అమ్మా! మేము పరదేశులము మా కీపూట నింత యన్నము పెట్టెదవా? యని యడిగిన నేమియు మాటాడక యా బ్రాహ్మణి లోనికింబోయినది. ఆ పారులు దేశద్రిమ్మరులగుటచే నంతటితో బోక వెనుదగిలి లోపలకుబోయి ఏమమ్మా! మాటాడవు నిన్నే యడుగుచున్నారము. పొమ్మంటివా యని యెంత యడగినను మాటాడక వాగింజూడక యొకగదిలోనికిం బోయి తలుపు వైచికొనినది.

అప్పుడా బాడబులా పడతి నతండ వేఱొకలాగునం దలంచుచు నాయిల్లువెడలి యన్నార్థులయి పోవుచు దారిప్రక్కను గిలకలాగుచు నీరు చేదుచున్న దేవశర్మం