పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రుని కథ

245

దని చెప్పలేను. మేడలమాట యటుండనిమ్ము. వీథులలోనే రతనంపుఁబలకలు స్థాపింపబడియున్నవి. మృత్తుకకంటె బంగారము మెండుగా గనంబడుచుండును తొమ్మిదినిధుల కధికారము గలిగిన ప్రభువు పాలించు వీటి మేటిదనం బెన్న నేల? పరమేశ్వరుని సృష్టియనెడు రాజ్యము కది ధనాగారమని చెప్చనోపు

గీ. రాజమార్గము లెల్లెడల రత్నములనె
   మలచి స్థాపించి రొగి రాతిపలకలట్లు
   మాటలేటికి నవ్వీట మన్నుకన్న
   చవకసుమ్మన్న! పైఁడి యేచక్కి చూడ.

గీ. భూములనిరెయు బంగారు భూములనినఁ
   జెప్పనేటికి సౌధవిశేషగరిమ
   నవనిధులుగల్గి పొలుపొందు నగరమందు
   గల యొయారముఁజెప్ప నాకలవియగునె

అది యట్లుండె చారుమతి యంతఃపురంబునఁగల వింతలఁజూచి యది యింద్రజాలమని తలంచితి. అచ్చటివిశేషములు సంక్షేపముగా జెప్పినను సంవత్సరము పట్టకమానదు.

చారుమతి నాతో నేకశయ్యాసముల మెలంగుచు భోజనభాజనములందు నన్ను మిక్కిలి గారవమిగాఁ జూచుచుండెను. నేనుఁదల్పగతుండనైనప్పుడు నిద్రించు చున్నానని తలంచి యయ్యించుబోడులిట్లు సంభాషించుకొనిరి.

చారుమతి - మల్లి కా! యిక్కుమారీరత్నమును జూచినంతనే నాస్వాంతము వికారము నొందినది. ఆ సోయగము తనివిదీరఁ జూడకయే యాడుదానిం గావించితిమి. మాతండ్రిచేసిన నియమమెట్లు సాద్గుణ్యము నొందును. తదాకృతి వేగముగాఁ చూడ వేడుకయగుచున్నది.

మల్లిక - సౌందర్యైకపక్షపాతియగు కందర్పునిచేత నిట్లయితివి నీవేమి చేయుదువు? ఎదియుం గూర్చువాఁడు విధియేకదా. పురుషునిం గావించుకొనుము .

చారుమతి - మాతండ్రి యెఱింగెనేనిఁ బ్రమాదము కాదా.

మల్లిక - తెలియకుండ నడుపువారము మేముండ నీకేమి కొదవ? అదియునుంగాక నీయందుగల ప్రేముడియే నీతల్లిదండ్రులను సమాధానము పెట్టగలదు.

చారుమతి - తరువాత నేమైనను సరియేకాని యిమ్మనోహరుని విడువజాలను కావున వేళయైనది, పోదములెండు. కేళీగుహాంతరమునందే యని మాట్లాడుకొనుచున్న సమయమున నేను లేచితిని. అప్పుడందరము మునుపటి గుహామార్గంబున స్ఫటికశిలామంటపమున కరిగితిమి.

అప్పుడు మల్లిక నన్ను బుష్పవనములోనున్న వేఱొకతటాకములో తీర్థమాడించినంత నేను యథాప్రకారము పురుషుండనైతిని నన్నుఁజూచి యాచిగురుబోడి లజ్జా విభ్రమములతో నొప్పుచున్నంత సఖురాండ్రు సూటిమాటలచే నబ్బోటి నెత్తి