పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సునీతి కథ

27

మఱియుఁ బెక్కుతెఱంగుల వినయవిశ్వాసము లేర్పడఁ జతురోక్తులచే నతని అంతరంగముఁ గఱుగఁజేసినది.

అప్పు డతండు మిక్కిలి సంతోషించుచుఁ దదర్చనల నంగీకరించి తానుదెచ్చిన యనర్ఘరత్నమండనము లాయెలనాగ కందిచ్చెను.

అపూర్వములైన యావస్తువిశేషములు స్వీకరించి సునీతి తదీయప్రభాపటలములు కన్నులకు మిఱుమిట్లు గొలుపుచుండ నతనిది దేవతాప్రభావమని యగ్గించుచు నభ్బూషలందాల్చి వేల్పుచేడియలం దిరస్కరించి సోయగమున నొప్పుచుండెను.

అపురుషుం డత్తరుఱితో నారాత్రి రతివిరహితములగు కృత్యములు పెక్కు గావించి యమ్మించుబోఁడిం బరితుష్టురాలింగావించి యుదయంబున దననివాసమునకుఁ బోయెను.

ఈరీఁతి బ్రతిదినము రాత్రి వచ్చి యుదయంబునఁ బోవుచుండును. మఱియు నతఁడు వచ్చునప్పుడు నిత్యము కోటిదీనారములు వెలగల నగలందెచ్చుచుండును. సునీతియు నారత్నములు మార్చి దేవతారాధనములు వ్రతములు నియమములు చేయుచు దానధర్మములకై యేదినమునఁ దెచ్చినసొమ్ము లానాఁడే వ్యయము చేయు చుండును.

దానంజేసి సునీతి మిగులపుణ్యాత్మురాలనియు, జయభద్రుఁడు అన్నదమ్ములలో మిక్కిలి ప్రయోజకుఁడనియు భూమియంతయు వాడుక మ్రోసినది.

అని చెప్పినంత నాగోపకుమారుఁడు మణిసిద్ధుంజూచి నమస్కరింపుచు, అయ్యా! నాకొక సందియము గలిగినది. వెఱ్ఱిగొల్లవాఁడనుగదాఅని సందర్బము లేకుండ నీకథఁజెప్పుకొని పోవుచున్న వారు, జయభదుఁడు అనంగచంద్రిక యింటిలో నుండువాఁడని యిదివఱకు చెప్పితిరి. దాని విడిచి సునీతియింటి కారాత్రి రాగతఁమేమి? వచ్చెనచో, యిట్టివిలువగల రత్నవస్తువు లెట్టు తెచ్చుచున్నవాఁడు వాని వృత్తాంత మేమియునుం జెప్పకయే సునీతి యంతికమునకు వచ్చుచున్నట్లు నుడువుచుంటిరి. మఱియు రతిజేయకయే సంతుష్టి జెందుచుండెనని చెప్పితిరి. అటుచేయుటకుఁ గారణం బేమి? నాకేమియు వీడిపోకున్నది. తెల్లముగా నెఱింగింపుఁడు అని అడిగిన మణిసిద్దుండు నవ్వుచు నిట్లనియె.

వత్సా! నీ వీమాట అడిగెదవో లేదో అని నీ శ్రద్ధాళుత్వము దెలిసికొను తలంపుతో నట్లు చెప్పితివి. గ్రహించితిని. చెప్పెద వినుము. సునీతి వశ్యౌషధియొక్క పసరు మగనిపైఁ జిమ్మక పుట్టలోఁ బోసెనని చెప్పితినిగదా. అసమయమునఁ బాతాళలోకనాయకుండైన నాగరాజు భూమికి విహారార్ధమై యాదారిని బైకివచ్చుచున్నవాఁడు ఆపసరు శిరమునఁ బడినది. తోడనే మనము గఱిగి యతండు సునీతియందు బద్దానురాగుండై, కామరూపుఁడగుట సునీతిపాతివ్రత్య ప్రభావము తెలిసికొని పాతాళలోకసంభూతమునగు రత్నములతో జయభద్రునివేషముతో వచ్చి యాసుందరింజేరి సంతోషబఱుచుచుండెను. పాతివ్రత్యభంగంబు సేయనొల్లక దివ్యప్రభావంబున నట్టి