పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

కాశీమజిలీకథలు - మూడవభాగము

జ్ఞాపకములేదు. నేనొక రాజకుమారుడను. నాపేరు చంద్రుడందురు. మల్లికార్జునదేవు ననుగ్రహమే నన్నిచ్చటికి దీసికొనివచ్చినది. నారాకవలన మీకపకారము కాదుకద! అటులైన నిప్పుడేపోయెదను మాకిందొక ప్రయోజనములేదని యతి గాంభీర్యముగా బలికినవిని యక్కలికి యించుక నవ్వుచు నిట్లనియె.

మీ రమానుష ప్రభావసంపన్నులు కూకుండిన నిచ్చట కెట్లువత్తురు? ఆత్మీయ నివాసమున కరుదెంచిన మహాత్ముల సత్కరించుట గృహస్థధర్మము. కావున మీరు పూజార్హులయి యున్నారు. మా సకురాలా స్పటికశిలామంటపమున నున్నది. మీరాక విని మిమ్ములను దోడితేర నన్ను బుచ్చినది మిమ్ములనుంజూడ మిగుల వేడుక పడుచున్నదని క్రమంబున బరిచయము గలుగజేసి యచ్చట జరిగిన వృత్తాంతమంతయుం జెప్పి నన్నచటికి రమ్మన నిర్బంధపెట్టెను.

అప్పుడు నే మేమియు బలుకక పూజనంగీకరించుటకు బోలె దానివెంట నా మంటపమునకు బోయితిని. నన్నుజూచి యెల్లరులేచి నిలువంబడిరి నే నెవ్వరివంకను జూడక వారినందరం గూర్చుండుడని హస్త సంజ్ఞ చేసి మల్లికచేగూర్చుంటిని.

అప్పుడు-

సీ. చైతన్యమొందిన చక్కని చిత్రంబు
               చిఱునవ్వు మఱఁగిన చిరుగుబొమ్మ
    నడుగాడనేర్చిన నవకంపునునుదీగ
              మురిపెంబుబూరిన నిరులయొత్తు
    పంకవాఁయఁగబెట్టి వచ్చిన క్రొన్నెల
              బలుకభ్యసించిన పసిడిమెమ్మ
    నిలుకడవడసిని తొలుకాఱుమెఱుఁగెల్ల
              గైసేసి తెచ్చిన కామునలుగు
గీ. నాగ నభిరామభూరి సౌందర్యవిభ్ర
   మప్రభాస్ఫూర్తిదగు చారుమతి మదీయ
   నికటమున నోరగానల్లనిల్చి మ్రొక్కి
   తళుకుచెక్కులనవ్వు మొల్కలు సెలంగ.

ఉ. ఇంచుకనాపయిం బరపు నిండుకళావళిముంచి తెచ్చి పై
     వంచిపోల్కెఁ బువ్వువలవైచిన చాడ్పునఁగ ల్వదండసా
     రించిన లీలఁ దమ్మివిరిఁ ద్రిప్పినభంగి మెఱుంగుతీగెఁ గు
     ప్పించినమాడ్కి వాలుజళిపించిన నడినిరలి నేత్రముల్.

ఆతళ్కు చూపులచేత నపహృత ధైర్యుండనై మేను వివశత్వము నొంద నొండెరుంగక వెండియుం దదీయ రూపం బక్షులం గ్రోలువాడువలెజూడ దొడంగితిని అప్పుడు మాయిరువుర మేనులం బొడమిన సాత్విక భావవికారముల జూచి యందున్న సుందరు లొండొరుల జూచుకొని నవ్వుకొన దొడంగితివి.