పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

కాశీమజిలీకథలు - మూడవభాగము

గురిలో నుండుటచే వీలుబడినదికాదు మన చారుమతికిట్టి మనోహరుని లభింపజేయుమని మల్లికార్జునదేవున కనేక నమస్కారములు జేసితిని కావున నీవన్నమాట యధార్ధమగును.

తమాలిక - మనసఖురాలి కల తెరంగరయ శోభనదినములు సమీపించున్నట్లు తోచుచున్నది.

చారుమతి - పోనిండు. వేళ యతిక్రమించుచున్నది. పోవుదము లెండని పలికిన నందఱు నిష్క్రమించి యా గుహామార్గమునంబోయిరి.

ఆ మాటలువిని నేను అమృతసాగరంబున మునింగిన యట్లు పరవశుండనై యొక్కింతవడి యేమియుం దెలియక మత్పురాకృత సుకృతపరిపాటు కచ్చెరువు నొందుచు దైవ సంఘటితము మెచ్చుకొనుచు నమ్మచ్చెకంటుల మాటలచే నబ్బోటి మాణిభద్రుని అభీష్ట దేవతయయిన హటకేశ్వరుడని నీస్ఫటికశిలామంటపమున నొప్పుచున్న శివలింగము అనియు వివాహాపేక్షం జేసి యా చిన్నది ప్రతిదినము నీస్వామి నారాధింపు చున్నదనియుం దెలిసికొని బిల్వవృక్షము పుడమింగల తీర్థములన్నియుం ద్రిప్పిన సుకృతంబునకు ఫలమిదియని నిశ్చయించి మే నుబ్బి గొబ్బున నా మంటపమునకుంజని నిర్భయముగా విహరింపుచు గదళీఫలంబులు దిని నీరుగ్రోలి యత్యంత సంతోషముతో నారేయి గడపితిని.

మరునా డుదయకాలమని తోచిన సమయమున నత్తటాకమున స్నానముజేసి జపావసానమున నమ్మంటపము నున్న పూజాపాత్రము లన్నియు దారుమారుగా నునిచి నిర్మాల్యము తటాకజలంబునం బడవైచి యాలింగమున కభిషేకము జేసి మనోజ్ఞములైన బూవులచేత సహస్రనామార్చనంబు గావించి యా హటకేశ్వరుని బెక్కుతెఱగుల వినుతించితిని.

మఱియు నందెక్కుదించి యుంచిన విపంచి గైకొని చక్కగా మేళగించి గళరవంబు నెలంగ గొంతసేపు మంగళగీతంబులం బాడితిని.

అంతలో నక్కాంతల మేని పరిమళము నాసాపర్వము గావించుటయు మించినతత్తరముతో చేనుత్తరపు దెసనున్న పూవులతోటలోనికింబోయి యందలి వింతలం జూచుచు విహరింపుచుంటిని.

పిమ్మట నాకొమ్మలు నచ్చటికివచ్చి పుష్పార్చితంబైన యా లింగమును జూచి వెరగుపడచు వింతవారెవ్వరో వచ్చుచున్నారని నిశ్చయించి తలయొకమూలకుంబోయి వెదకదొడగిరి.

వారిలో మల్లిక యనునది నేనున్న తోటలోనికివచ్చి యబ్బురపాటుతో నన్ను జూచి యేగినది. అయ్యెలనాగ యేగినకొంతసేపటికి మఱికొందరు సుందరులు వచ్చి దూరదూరముగా నిలచి పరిశీలించిపోయిరి. ఎవతె వచ్చినను దూరముగానుండి