పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయుని కథ

229

కిఁబోయి చచ్చినట్లున్న విజయునుంజూచి తక్కినవారి నెవ్వరింగానక యందుండినచో నాయపరాధము తమమీద బడునని వెఱచుచు నెవ్వరికింజెప్పక తలయొకదారిం బారిపోయిరి.

అంతట దైవికముగా కొంత ప్రొద్దెక్కినతరువాత నాదారి నొక వైద్యుఁడు బోవుచు గత్తివ్రేటుదిని జీవితముల బాయక యందు బడియున్న యా రాజకుమారునిం జూచి విమర్శించి యావైద్యుడా ప్రాంతమునకుఁబోయి కొన్ని మూలికల యాకులం దీసికొని వచ్చి యా గాయమునందు పసరుబిండి యాకత్తిదీసెను.

ఆ పసరుమహిమ యెట్టిదో వెంటనే కుత్తుక యత్తుకొన నతండు నిద్రలేచినట్లులేచెను. అప్పుడా వైద్యుడు విజయునిజూచి నీవెవ్వండవు? నిన్నెవరిట్లు చంపిరి? నీ యాయువు దృఢమైనది నాకుగాక యీ వైద్యము మఱియెవ్వరికిం దెలియదు. దైవనియోగంబున నిన్ను వ్రేసిన వారాకత్తియందుంచిరి. కాని తీసినచో నప్పుడే చచ్చిపోవుదువు. నీవిట్లు దిక్కుమాలి యొక్కరుఁడ నీచెట్టుక్రిందంబడి యుండితివేల అని యడిగిన నతం డతనికి నమస్కరింపుచు దనవృత్తాంత మంతయు జెప్పి మహాత్మా! నిన్ను నాభాగ్యదేవతగా దలంచెదను. నీయుపకృతికేమియు బ్రతికృతి గావింపనేర? యావజ్జీవము నిన్ను స్మరించుకొనుచుందు. నీకతంబున జీవింపగలిగితి. నన్ను జంపినవాడు నా సోదరుడు కావలయు. వానికి నాయందింత అసూయ యుండుటకుగారణము కనంబడదు. ప్రాణప్రియురాలై న భార్య యిట్టిపని చేయునా ఏమనుటకుం దోచకున్నది. ముందు నిజము దైవమే చెప్పునని పలికి మిక్కిలి విలువగల తనవ్రేలి యుంగర మా వైద్యునకు గానుకగా నొసంగి యంపి తాను మొదటబోవ నిశ్చయించుకొన్న తావునకు బదిదినములకు బోయెను.

అందొకచోట తన నిమిత్త మెదురుచూచుచున్న కడపటి తమ్ముడు చంద్రుడు గనంబడుటయు కౌగిలించుకొని తమ్ముడా? ఇక్కడకువచ్చి యెంతకాలమైనది? మా కొరకు వేచియుంటివి కాబోలు. రాముడు కనబడెనా? ఎందెందు దిరిగితివి? ఏమేమి వింతలంగంటివి. వివాహమాడితివా? నేను నిన్ను జూడకయే పోదును. దైవనియోగంబున బ్రతికితినని తాను పురము వెడలినది మొదలు నాటి తుదవరకు జరిగిన కధ యంతయు జెప్పెను.

ఆ కధవిని హర్షసంభ్రమశోకంబులు మనంబునం బెనగొన చంద్రుడు యేమీ! మన భాను డెంత జేసెను. అన్నా వాడు సేయకున్న నందుండకపోవునా? జాతివైర మూరకపోవదు. నా వృత్తాంతములు సవిస్తరముగా జెప్పెద నాకర్ణింపుమని యిట్లు చెప్పదొడంగెను.

చంద్రుని కథ

అన్నా మనమందర మొక్కసారియేకదా పట్టణము వదలిపోయితిమి. నేను మొదట నుత్తరదేశమునకుబోయి అందు బ్రసిద్ధములయిన పట్టణములందు విమర్శిం