పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

కాశీమజిలీకథలు - మూడవభాగము

మాకిప్పుడు వేగుర ఖననసాధనములతో నున్న కూలివాండ్ర నిప్పింపవలయు, మఱియు నూఱుగజముల గొలుసుతో మున్నూఱురక్షకభటులను దత్క్షణము మాకు సహాయముగా బంపవలయును. ఈ పట్టణములో గొన్ని క్రొత్తవీథు లేర్పఱచవలయునని రాజశాసనమైనది. దీనిలో నేమాత్ర మాలస్యమైనను మీయుద్యోగములు నిలువవు. అని పలికిన భయపడుచు నది నిక్కువమనుకొని చిత్తము చిత్తము మీరు చెప్పినరీతిగా రెండుగడియలలో సమకూర్తు ననియొప్పుకొని యామంత్రి యట్లు సమకూర్చి పంపెను.

ఆరాజకుమారుడు వారినెల్లర వెంటబెట్టుకొని యిరువీథులందు మంచిమేడలు గనంబడిన చోటునకుంబోయి మేడమీదుగా గొలుసులాగించి దీనిమీదుగా గ్రొత్తవీథి వేయవలయు నిందున్నవారెవ్వరు? తత్క్షణమే లేచిపోవలయునని పలికిన నా యజమానుండు వెలుపలికి వచ్చి యా జనమునంతయు జూచి తన యిల్లు త్రవ్వుటకు సిద్ధముగానుండుట దెలిసికొని అయ్యో? క్రొత్తగా గట్టికొంటి పెక్కురొక్కము వ్యయమైనది ఇట్టి మేడ గూలద్రోయింతు మన్న నేమి సేయుదును. అని మొరవెట్టు కొనెను.

అది మాకు దెలియదు. లేచిపోయెదవా? పొమ్ము లేకున్న నిప్పుడే త్రవ్వింతు అడ్డము వచ్చిన బందీగృహమునం బెట్టింతు వీనితో మనకేల త్రవ్వుడు త్రవ్వుడని విజయుడు పనివాండ్ర దొందరబెట్టెను.

అప్పుడు మొఱ్ఱోయని యాయజమాను డేడ్చుచు నతిని పాదంబులం బడిన వట్టిమాటలకు గార్యములు కావని యతడు పలికెను. ఆసూచన గ్రహించి యా యజమానుడు విజయుని దనమేడమీదికి దీసికొనిపోయి గుజగుజలాడి చివరకు నాయింటివిలువలో కొంతసొ మ్మతని కిచ్చున ట్లొడంబడి యప్పుడే యట్లు చేసెను.

అక్కడినుండి వెడలి వేఱొకమేడయొద్దకు బోయి పగ్గము నింటిమీదకు లాగించునంతలో నాయజమానుడును వెనుకటివార్త విని పెక్కురొక్కమిచ్చి యితని సమాధానపఱచుకొనెను ఆ వార్త గ్రామమంతయు మ్రోగినది. కావున విజయు డాజనముతో తమయింటియొద్దకు వచ్చినతోడనే పౌరులు తత్తమగృహాధిక్యమునుబట్టి ద్రవ్యము సమర్పించుచుండిరి. అట్లు సాయంకాలముదనుక తిరుగువరకు నపారమైన ధనము ప్రోగుపడినది.

ఆ ధనమంతయు నొకయింటిలో దాచి యాపనివాండ్రం బిలిచి యీయూరిలో నందఱు మూర్ఖులుగా గనబడుచున్నవారు. ఎక్కడ వీథి వేయుదమన్నను దమయిల్లు పోవునని యేడ్చుచుండిరి. నేను మిక్కిలి భూతదయగలవాడను. ఒకరు చింతించుచుండ నే పనియుజేయజాల గావున నీదినమునకుం బొండు వేఱొకప్పు డాలోచించు కొందమని చెప్పి వాండ్రకందఱుకు కానుకలిచ్చి యంపెను.

అమ్మరునాడే యాయూరిలో నేడంతరములుగల యొకసౌధము వెలకు దీసికొని యేడంతరములయందును అద్దములు పటములు బంగారుమయములుగా నిండించి