పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

కాశీమజిలీకథలు - మూడవభాగము

నేను సంపూర్ణయౌవననై యున్నతరి నాతండ్రి నాకు వివాహముసేయ ప్రయత్నించెను. ఈ రాజ్యమునకు నేనకర్తనగుదునని మత్సరముజెంది వినీతి నా వివాహప్రయత్నమున కెద్దియో విఘ్నము సేయుచుండునది. ఇట్లుండ మొన్నటిదినంబున మా తండ్రి వేటకు జనియెను. అతండరిగినది మొదలు నన్ను జూడవలయునని పెక్కువార్తల నంపినది. విసిగి తుదకు నేను భయపడుచు నామె మేడకు నిన్నటి సాయంకాలమునం బోయితిని. నన్నుజూచి కడు ననురాగము కలదానివలె కౌగిలించు కొనుచు బీఠంబున గూర్చుండబెట్టి కొంత సేపు మంచిమాటలచే గడపి యెద్దియో ఫలహారము దీసికొనివచ్చి తినుమని చెప్పినది. నాకనుమానము గలిగి యిప్పుడు సైచదనిచెప్పి తినక మూట గట్టికొంటిని. అంతటితో విడువక గంధము పూయించి పుష్పమాలికలువైచి పువ్వులు తురిమి వాసన జూడుమని యెద్దియో పరిమళద్రవ్యముతీసుకొనివచ్చి ముక్కు నొద్ద బెట్టినది. ఆ తావి యాఘ్రాణించినతోడనే నామేను వివశత్వము జెందినది తరువాత నేమి జరిగినదో నేనెఱుగను. నిన్నటి రాత్రియే యీ పని జరిగినది. దేవరకటాక్షవీక్షంబునం బ్రతికితిని నీవు కన్యార్దివై యరుగుచున్నాడవుగదా? నేను మీ పాదసేవజేసికొని జీవించెద నన్ను భార్యగాగైకొమ్మని ప్రార్థించినది.

ఆ మాటలువిని యా రాజకుమారుండు మిక్కిలి విస్మయమందుచు ఔరా! స్త్రీ సాహసము? ద్రవ్యాశయెట్టి పనులం గావించునో! ఆహా! యని ధ్యానించుచుగానిమ్ము దైవము నాకయత్నోపలబ్దముగా నీ చిన్నదాన సమకూర్చెను ఇది రూపంబున దేవకన్యకలం దిరస్కరింపుచున్నది. ఇంతకస్న గావలసినది యొండెద్ది యున్నదని తలంచి యమ్మించుబోడి కభయహస్తమిచ్చి రెండుమూడు దినంబులలో నక్కాంతను స్వస్థతగలదానిగా జేసెను.

మఱియొకనాడు సాయంకాలమున నారాజకుమారుడా చిన్నదియున్న గదిలోనికివచ్చి మెల్లన నిట్లనియె.

తన్వీ! నేనిందాక నంగడికిబోవ నచ్చట నిన్ను గుఱించి జనులెల్లరు నద్బుతముగా జెప్పుకొనుచున్న వారు, రాజుగారు లేని సమయంబున నీవెవ్వరినో తీసికొని పోయితివని నీ సవతితల్లి వేటనుండి వచ్చిన తరువాత రాజుతో జెప్పెనట అప్పుడు మిక్కిలి కోపించుచు నతండు నలుదిక్కులకు దూతలం బంపెనట. అట్టివారిం బట్టి యిచ్చిన వారికి బారితోషికమిత్తునని ప్రకటించెనట. ఈ మాటలే అల్లకల్లోలముగా గ్రామమంతయు జెప్పుకొనుచున్నవారు ఎట్టి కల్పితము చేసెనో చూడుము మన మిందుండుట నెవ్వరేని వినినచో బ్రమాదము రాగలదు. ఇప్పుడు నిజము చెప్పినను నమ్మరు. కావున నెందేని బోవలయు నేమనియెద వనిన నాకదియే యుత్తమమని తోచినదని యాచిన్నది చెప్పినది.

నాటి యర్ధరాత్రంబున నతండాయింతిని తురగముపై నెక్కించుకొని యతి