పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

211

వృత్తాంతము రహస్యముగా బాదుషాగారికి జెప్పి యెల్లుండివరకు దగవు నిలుపజేసితిని. నీవోడినప్పుడు వాని బ్రోచెడుఱేని యానతిచొప్పున నడతునని వ్రాసితిని. దాని కర్ధమేమి? నీయభిప్రాయము చెప్పుము. గెలిచిన పండితుని బాలించెడువాని యాజ్ఞ వహింపనేల యని పాదుషాగా రాక్షేపించిరి దీనిలో నంతరమేమైనంగలదా? యని యడిగిన విని మందారవల్లి యిట్లనియె:

తండ్రీ! నేనేమి చెప్పుదును? అప్పటియూహ నిప్పుడేమి పనికివచ్చును? నే నెవ్వరికి నోడనసు విద్యాగర్వముచేత దరిద్రులైన విద్యాంసులవలన ధనమాకర్షించుట సరిపడదని దదాధారభూతులగు రాజులనే ముఖ్యులుగా నెంచితిని. అదియే విషమించినది. దీనికి సాధనము మీరే యోచింపవలయుననుటయు విజయవర్మ పోనీ, యమ్మహారాజు మిగుల బ్రఖ్యాతు డతనిం బెండ్లియాడెదవేని యేకొరంతయు నుండదు. దీనం దప్పేమియని యడిగిన నాకాంత యతనితో మార్గములో రామకవి పజ్జ పత్నీభావంబు వహించి గూర్చున్న వృత్తాంతమంతయుఁజెప్పి యతనిగాక వేఱొకని బెండ్లియాడుట సతీధర్మముకాదని చెప్పినది. ఆకథవిని యతండు మరియు వెరగందుచు నేమిచేయుటకుం దోచక మంచిచి ఱేపు విచారింతమని పలికి యంతటితో నాసభ చాలించి యాలోచన మందిరంబునకు బోయెను.

అమ్మరునాఁ డుదయకాలంబున సుప్రభ మంగమణింజీరి అమ్మా! నీ తండ్రికి మీ విషయమై రాత్రియంతయు నిద్రలేదు. పాదుషాగారు రేపటిదినము నీవోడినట్లు త్తర మిత్తురట. అప్పుడు కృష్ణదేవరాయలకు దాదివై యుండవలయును. అతండు మఱియేమి శంకించునో రామకవి సుభద్రుండు నెందున్న వారు? వారినెందు విడిచి వచ్చితిరి? వారినిరప్పింపవలయునని తలంచుచున్నారు. ఏదియుం దోచకున్నదట. కులప్రవృత్తి తెలియకపోవుటచే నిన్నిపాట్లు వచ్చినవి. అచ్చటినుండి వచ్చిన రామలింగకవిం బ్రార్ధించిన నెద్దియో నుపాయము చెప్పునని తలంచిరి. అతండేకదా యింతకును మూలమని పలుకుచున్న సమయంబున వీధినుండి నాగమణి వడిగావచ్చి అమ్మా ఇప్పుడు మనవీధిలోనుండి తెనాలి రామలింగకవియట పదుగురు బ్రాహ్మణులు చుట్టునుం బరివేష్టించి రాననగుచున్నాడు. దుష్టవర్మయను సామంతరాజునకు నద్బుతపురాణముచెప్పి పూర్వము మోసపుచ్చెనట. ఆతగ వీదినమున విచారించి మోహనచంద్రుడు రామలింగకవిని మిక్కిలి మెచ్చుకొనుచు నతనిపక్షమే తీరుపు జెప్పెనట ఆమాటలే చెప్పుకొనుచు బోవుచున్నారు. అతనిమెడలో బుష్పమాలికలు వైచి బ్రాహ్మణులెల్లరు స్తోత్రములు చేయుచున్నారు. ఎవ్వరో యెదురుపడిన నిలువంబడి మాటలాడుచున్నారు. మన వీధి మేడమీదికిబోయి చూచిన గనంబడుడు రని పలికినవిని యదరిపడుచు మంగమణియు బ్రియంవదయు సుప్రభయు నాగమణియు నామేడమీదికి బోయి గవాక్షకవాటములు తెరచుకొనిచూచిరి.

అప్పుడు మంగమణి మే నుప్పొంగ బ్రియంవదతో సఖీ! చూడుచూడు ఈతడు రామలింగకవివలె నున్నా డేమి అగు నిశ్చయమే. నడక గురుతుజెప్పుచున్నది