పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

కాశీమజిలీకథలు - మూడవభాగము

వారి విషయమై మీకెట్టి యభిప్రాయమున్నది. వారు వచ్చిన స్వీకరించి మన్నింతురా? యని యడిగిన సుప్రభ యిట్లనియె.

అయ్యో? ప్రాణప్రియులయిన నాముద్దుకూనల నెప్పుడు చూతునని యాతురము చెందుచున్నదాన. స్వీకరింతురా? యని పలుకుచుంటిరే? మీరెక్కడ జూచితిరి! నా పసికూన యేలాగుననున్నది? మామాట యెఱుంగదు కాబోలు. తన కథ యేమని చెప్పుచుండునది. తన్ను కన్నతల్లి మనోరంజని యనియే చెప్పుచుండునది. యా నిర్దయురాలైన యీ పాపాత్మురాలి నెఱుంగనని పలుకుచు బెద్ద యెలుంగున శోకింప దొడంగినది.

ఆమె శోకవృత్తిజూచి మంగమణి నిలువలేక హా! తల్లీ నేనే నీకీ శోకము గలుగజేసిన కష్టాత్మురాల. ఇదియే ప్రియంవదయని చెప్పుచు నామెం గౌగలించుకొని పరితపింప దొడంగినది. అప్పుడు సుప్రభయు నాగమణియు నంతఃపురకాంతలు నామాటలువిని విస్మయసాగరంబున మునుంగుచు మంగమణిని, బ్రియంవదను వితర్కపూర్యకముగా నాలింగనము చేసికొనుచు ముసుంగులు దీసి తదీయ రూపలావణ్యాది విశేషముల కచ్చెరువందుచుండ నావార్తవిని మంత్రియు నచ్చోటికి వచ్చి వారి వృత్తాంతమంతయును విని యపారసంతోషముతో గన్నుల నానంద బాష్పములు గ్రమ్మ గద్గదకంఠముతో వారిం గ్రుచ్చియెత్తి పెద్దతడవు తదాలాపవిశేషములతో గాలక్షేపము గావించెను

మఱికొంతసేపునకు మందారవల్లి తండ్రితో తండ్రీ! మాతగవు వృత్తాంత మంతయు నీవు వినియేయుందువు నన్ను రామలింగకవి లవిత్రయను పేరుతో వచ్చి కపటంబున జయించెను. శాపకారణంబున నెదురునిలిచి నేను వాదింపలేను. ఆ విషయ మతండెట్లో గ్రహించెనని తలంచెదను. ఇప్పుడు మేమేమి చేయదగినది వేశ్యలమనుకొని యిట్టివాదములకు బూనుకొంటిమి. మాయోటమి స్థిరపడెనేని పెక్కు చిక్కులురాగలవు. ఎట్లయిన గెలుచు నుపాయంబు జూడవలయునని తన ప్రసంగవృత్తాంతమంతయు జెప్పుటయు నతండు సంశయాకులహృదయుండై యప్పటి కేమియుం జెప్పక వారి నోదార్చుచు నూత్నభరణాదు లొసంగి యంతరంగగతవృత్తాంతప్రసంగముతో నాదివసము తృటిగా వెళ్ళించెను.

అమ్మఱునాడు సాయంకాలమున మంత్రి యంతఃపురమున గూర్చుండి పుత్రికల రప్పించుకొని యల్లన నిట్లనియె పట్టీ! ఈదివసంబున మోహనచంద్రుడు మీ తగవు విచారించెను. విజయనగరమునుండి తెనాలిరామలింగకవి వాదింపవచ్చెను. తన వాదమంతయు నధికారి నెఱుంగజేసెను. మీవిషయమై నేను పెద్దతడవు వాదించితిని. కాని చక్రవర్తి యభిప్రాయము వారిపక్షముగా నుస్నయది. నీవు స్త్రీలయెదుటకూడ నిలువవని చెప్పుట కవకాశమేమియు గనంబడదు. నీవాయూరిలో నితరస్త్రీలతో సంభాషించినట్లు సాక్ష్యమును జూపుచున్నవారు. తలపోయ మన వాదము మనకే సరిపడలేదు. శాపలోపము మనల బాధించునుగాని వారికేమి? నీ