పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

కాశీమజిలీకథలు - మూడవభాగము

బెంచిన మంజుభాషిణియుం గాలధర్మము నొందినది. ఇదియే నేనెరింగిన కథ అని యతండు చెప్పిన సంతసించుచు నమస్కరించి నేనాయన యనుజ్జపుచ్చుకొని మఱియు విమర్శింప బ్రియంవద వృత్తాంతము నతండు చెప్పినట్లే చెప్పిరి.

పిమ్మట నేను వారిరువురిజాడ నరయుచు గొన్ని దినంబులు దేశాటనంబు జేసితిని. మందారవల్లి వాడుక జగంబంతయు వ్యాపించినది. కావున కృష్ణదేవరాయల యాస్థానకవీంద్రులతో బ్రసంగింప విజయనగరంబున కరిగెనను వార్తవని యచ్చటికి బోయితిని. అందు గపటోపాయమున నాయాస్థానకవీంద్రులు దానినోడించి వస్తువాహనములన్నియు లాగికొనగా దగవునకై ఢిల్లీ పట్టణంబునకు వచ్చినదని చెప్పిరి. ఆమాటవిని నేవెంటేని సంతసముతో వారింజూడ నిచటకు జనుదెంచితిని. ఇందు మీరు గాన్పించితిరి. ఇదియే జరిగిన వృత్తాంతము. భగవంతుని యనుగ్రహవిశేషమున నాచే బెంపబడిన బాలిక లిరువురు నొక్కచోటనే పెరిగి విద్యలలో ప్రౌఢలైరను వార్తవిని నేనపారసంతోషము జెందుచున్న దాన. వారిందువచ్చియే యుందురు. మీ బాంధవ్యము దెలియక యెందుండిరో అని కన్నుల నానందబాష్పముల వెడలించినది.

ఆ వృత్తాంతమంతయు విని సుప్రభ సంతోష వివశస్వాంతయై యొక్కింత సేపేమియుం బలుకక యంతలో చెప్పిరిల్లి నాగమణీ! నీవు చెప్పినకధ యంతయు నిక్కువమే. ఇది కలగాదుకద! ఏమేమీ వెండియుం జెప్పుము. కాశీలో వారు నీతో నేమని చెప్పిరి. జీవించియున్నదన్నమాట స్పష్టముగా వింటివా? అయ్యో? తాను క్షత్రియకన్యకయని యెఱుంగ వారకాంతవలె దేశాటనము చేయుచున్న దా? ఎంత పాపము? అని వెర్రిదానివలె నడిగినమాటయే యడుగుచు జెప్పినమాటయే చెప్పుచు వినినమాటయే వినుచు దద్దయు భ్రమింపదొడంగినది

అప్పుడు విజయవర్మయు నా వృత్తాంతమంతయుం వెండియుం దెల్లముగా దెలిసికొని అగునగు మందారవల్లి తగవును గురించి పత్రికలు రాయలవారి యాస్థానమునుండి మా సభకు వచ్చినవి. ఇంకను విమర్శింపలేదు. నీవూరక తొందరపడకుము. నేను పరిశీలించి రప్పించెదను. ఆ చిన్నది వారకాంత యనిపించుకొనినను శీలము గాపాడుకొనుచున్నది. యిది యొకటియే మనము మేలుగా నెంచుకొనదగి యున్నదని భార్య నూరడించి నాగమణిని మిక్కిలి గారవించెను.

అంతలో మంగమణి ప్రియంవదతో సఖీ! మనవృత్తాంతము సుప్రభతో జెప్పుట కెద్దియో యంతరాయము వచ్చుచున్నది. మంత్రిగారు వెళ్ళిరేమో చూచిరమ్ము. ఆమెయు దన యిడుమల మనతో జెప్పుకొన దొడంగినది. దుఃఖములు లేని వారులేరుగదా? ఏమందుము! పాపమామెకు మొదట జనించిన పుత్రిక గంగలో బడిపోయినది. తిరుగా సంతానములేదు. కావలసినంత సంపద యున్నది. ఏమి చేయును? దైవమెవ్వరిని సుఖముగా నుండనీయడుగదా? యని పలికినది. ప్రియంవదయు మెల్లన నాయంతఃపురమునకు బోయి తొంగిచూచి వచ్చి నెచ్చెలీ! మంత్రి