పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[25]

కల్పవల్లి కథ

201

నేను - రత్నముల వర్తకము చేయుదును. మా వారందరు సరకులం దీసికొని గ్రామముల మీదకు బోయిరి.

రోలం - ఎప్పుడు వత్తురు?

నేను - అది నాకుతెలియదు సరకులమ్మినవెంటనే వత్తురు.

రోలం - ఈ సౌధములో నెవ్వరి యానతిం బ్రవేశించితిరి?

నేను - ఈ సౌధమెవ్వరిదో వారియనుజ్ఞనే కై కొంటిమి.

రోలం - నీవు తిరస్కారభావముగా నుత్తరమిచుచ్చుంటివి. నేనెవ్వతెనో యెఱుంగుదువా! నీ యాజ్ఞాపత్రిక యేది?

నేను - మీకట్లు తోచినదికాని నా మాటయందదిలేదు. ఆజ్ఞాపత్రిక మావారియొద్ద నున్నది.

రోలం - కానిమ్ము. ఈ గదిలో నేమియున్నదో చూడవలయును. బీగము దీయింపుము.

నేను - ఇందు సరకులువైచికొని మావారు కొందఱు తాళము బిగించి యెచ్చటికో పోయిరి కావున బీగము దీయుటకు నాకు స్వతంత్రము చాలదు.

రోలం - నీకు స్వతంత్రము లేదుగాని నాకు గలిగియున్నది చూడుము అని పలుకుచు నెద్దియో యూదినది. అప్పుడు పెక్కండ్రు ఆయుధంబులం ధరించియచ్చటికి వచ్చిరి. వారింజూచి నాకు కంపము జనించినది. వారిచే నా బీగము పగుల వేయించి తలుపులు తీయించి లోనికింబోయి యందున్న కల్పవల్లింజూచి నన్నుం జీరి యా చేడియ యహంకారముతో నిట్లనియె.

ఏమే! బొంకులాడి. ఇందు సరకులున్నవని నాతో చెప్పితివే? ఈ వగలాడి యెవతె? మీ వార్త యెరుంగక వచ్చితిననుకొంటివా? ఇక మీపాట్లు చూచుకొనుడని పలుకుచు మేమెన్నియో తెరంగుల వేడికొనుచుండ మా మాటలు లెక్క సేయక యప్పుడే మా పాదములకు సంకెళ్ళలు వైపించి మమ్ముందీసికొనిపోయి చెరియొక చెఱసాలలో నుంపించినది.

అప్పటి మా దుఃఖమేమని వర్ణింతును. ఒకరినొక రోదార్చుటకైన వశమైనదిగాదు. గర్భవతియైన యారాజపుత్రిక యంతఃపురములలో పెక్కండ్రు పరిచారిక లూడిగములుసేయ మురిపెముగా బంధువుల విందులారగింపవలసిన దానికి బదులు చెఱసాలయుదు రాతినేలంబండుచు నంబలిగూడు దినవలసివచ్చె. ఆహా! దైవనిర్ణయము బెట్టిదో చూడుడు.

మఱికొన్ని మాసము లరిగిన వెనుక నా రోలంబ చెరసాలలోనుండి మమ్ము దన యొద్దకు రప్పించుకొని వెందులారా? మీరు మీ దేశమునకుబోవ తలంపు గలిగియున్న యడల జెప్పుడు. ఇప్పుడే ప్రత్యేకముగా నోడ నెక్కించి యంపించెదను. కానిచో వేరొక చెరసాలం బెట్టించవలయునని యడిగిన విని మేము విననందున