పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగమణికథ

179

వందనాద్యనుష్టానము దీర్చుకొని పట్టణమెల్లడలం దిరిగివచ్చి భుజించిన వెనుక యజ్జవరాండ్రయొద్దకు వచ్చి మంగమణితో మెల్లగా రామలింగకవి యిట్లనియె.

రమణీ! సఖ్యము సాప్తవదీనమని చెప్పుదురుగదా! పది దినములనుండి నీ సహవాసపరిచయము మాకు గలుగుచున్నది. కావున మ మ్ముత్తమమిత్రులుగా భావింపవలయును నీ యాకారగౌరవంబులు చూడ నాశ్రితమందారవల్లివని తోచకమానదు. నీ ప్రాపు లభించినప్పుడ మా యిడుములన్నియుం బోయినవనుకొంటిమి ధనము సంపాదించుట మిక్కిలి కష్టముగదా. నేను చిన్ననాటనుండియు దేశాటనము సేయుచున్నవాడను. కాని యెందైనను జాలినంత ద్రవ్యము దొరకలేదు. నే డొకయాధారము కనబడినది. దానికి మీ సహాయము కావలసియున్నది. మీరించుకసేపు శ్రమ వహించిన మేము భార్యాపుత్రులతో జిరకాలము సుఖింతుము. ఉత్తములకు జేయరాని పనులుండవు సాహసించి చెప్పుటకు వాక్కు రాకున్నది. ధనచాపల్యంబు చెప్పుమని యూరక ప్రేరేపించుచున్నయది. యేమిచేయుదును. నీ సౌహార్ద్రంబె యింతకును మూలంబని యూరకున్న రామలింగకవికి మంగమణి యిట్లనియె.

ఆర్యా! యీ మార్గములో మీరు మాకు జేయు సహాయంబే తాదృశంబే. ఏ బంధువు డిట్లు మన్నించును? ఏ మిత్రుం డిట్లు పచరించును? ఇట్టి మీ విషయమై కృతజ్ఞత జూపుటకాని యుపకారము సేయుటకాదు. దీనికి నన్నింత పొగడవలదు. నా వలన గావలసిన పని యెద్దియో వక్కాణింపుడు. వేగముగా జేసి మీ ఋణము దీర్చుకొందునని పలికిన నక్కలికి కతండిట్లనియె.

కలకంఠీ! యిట్లనుట నీకే తగును. మదీయవాంఛితం బాలింపుము. ఈపట్టణపు రాజు ధర్మకేతుడు, సార్ధకాహ్వయుం డతని పత్ని సుశీల. సుశీలయే ఆ సాధ్వీతిలకంబు వేల్పుటావుంగా జెప్పుదురు. ఆమె ప్రతి శుక్రవారము దంపతీపూజ గావించి యా దంపతుల కనల్పముగా గాంచనమణిభూషాంబరముల నొసఁగునట. అవ్వార్త నాలించి మేము ప్రొద్దుట రాజదర్శనమునకుంబోయి మా విద్యాపాటవముల జూపించితిమి. అతండు మెచ్చుకొని మీరు కుటుంబసహితముగా వచ్చితిరా అని అడిగెను. వచ్చితిమని యుత్తరమిచ్చితిమి. తృష్ణాప్రభావం బెట్టిదొ చూచితివా? మా మాటలు విని యా రాజు మీ రిరువురు భార్యాసహితముగ రేపుప్రొద్దుట దయచేయుడనిన గౌరవముగా ననిపిన వచ్చితిమి. అందుమూలమున మా యిరువురను రమ్మనిరి. ఇప్పు డేమి చేయవలయునో తోచకున్నది. దీని కెద్దియేని సాధనము చెప్పుదువని నిన్ను వేడుకొనుచున్నవాడనని అత్యంతనిపుణముగా బలికి యూరకుండెను.

అప్పుడా సుందరి మందహాసము చేయుచు బ్రియంవద మొగముజూచి బోటీ యీయన మాటలు వింటివా, దీనికి సాధన మెద్దియేని చెప్పవలయునట. ఏమని చెప్పుటకును నుపచారపరిగ్రహము మొగమాట పెట్టుచున్నది. మన మొకసారి వారిపజ్జల గూర్చుండవలయునని సూచించుచున్నవాడు. కానిమ్ము నింద్యకృత్యములచేత