పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(22)

దుష్టవర్మకథ

177

సించుచు రామలింగకవిం బెక్కుతెరంగుల వినుతించి యాగడువునకు మేమందరము డిల్లీకి వత్తుమని చెప్పుచు నప్పురంబున రెండుదినము లుండుమని నిర్భంధించి దేవతలు వాసవునిబోలె నారాధించిరి అతండు తన కులగోత్రనామములు గుట్టుపరచి యట్లు దుష్టవర్మను వంచించి యత్పురంబున మఱియొక దివసము మాత్రము నివసించి యమ్మఱునాడు మధ్యాహ్నమునుండి పయనముసాగించి అందున్న ధరణీబృందారకులందఱు పెద్దదూర మతని సాగనంపి అతనిచేత ననిపించుకొని వెనుకకుం బోయిరి.

మంగమణి కథ

రామలింగకవియు సుభద్రునితోగూడ బండియెక్కి యిష్టాలాపములాడికొనుచు బోవుచుండ గొంతదూర మరుగునప్పటికి సాయంకాలమైనది గ్రామ మేదియు గనంబడినదికాదు. చీకటికి వెరచుచు బండివా డెద్దులను వడిగాదోలుచుండెను. అట్టిసమయమున దారిలో నొకచోట నొకబండి అడ్డముగా నుండుట జూచి బండివాడు తనబండి నిలిపి యీబండి నిట్లు దారి కడ్డముబెట్టినవా రెవ్వరని యరచెను. ఆమాటవిని యాబండిలోనుండి యొకతొయ్యలి అయ్యా! మేము మార్గస్తులము. ఢిల్లీకి బోవుచున్నవారము మాబండియెద్దొకటి యందెద్దియో చూచి బెదరి త్రాడుత్రెంపుకొని పారిపోయినది దానిని వెదకుటకై బండివాడు పోయెను. పెద్దతడవైనది యింకను రాలేదు. చీకటిపడినది మేమాడువాండ్ర మిందుంటిమి. మా మగవారు ముందు బోయిరి. మాబండివాడు వచ్చువరకు నిలుతురేని మీకు మంచిపుణ్యము రాగలదు. రెండుబండ్లును గలిసిపోవచ్చును. ఆ బండిలోనున్న పుణ్యాత్ములెవ్వరో తెలియదు. ఈపాటి యుపకారముసేయ నొడంబడుడని వినయముగా వేడుకోగా నాపాటలగంధి మాటలువిని రామలింగకవి సుభద్రునికి సంజ్ఞచేసి తటాలున బండిదిగి మగువలారా? వెరవకుడు? మేము బ్రాహ్మణులము. విద్వాంసులము. ఉదరపోషణార్దమై దేశాటనము చేయుచున్నవారము. ఉపకారమెవ్వరికి నవసరముండకపోవదు. మీబండివాడు వచ్చుదనుక నిలిచియుందుము. రాకున్న వెదకి దీసికొనివత్తుము. దొరకకున్న మా బండి యెక్కించుకొని గ్రామమును జేర్పుదుము మిమ్ము బ్రాణప్రదముగా జూచుకొని మీమగవారి కప్పగింతుమని అత్యంతప్రియముగా బలికి అప్పుడే తనబండి దింపించెను.

ఆతని వాగ్దోరణి కత్తరుణి వెరగందుచు సంతోషముతో అయ్యా! మీరు బ్రాహ్మణులని వినినంతనే మాచింత పోయినది. విద్వాంసులైన మీ సహవాసము మంగళములం గూర్పకపోవునా? మీకిదే నమస్కారమని కాలక్షేపమునకై ఆతని వినుతింపుచు గొంతసేపు గడపినది. కాని యెంతకు నాబండివాని జాడ కనిపించినది కాదు. అప్పుడు వారు తమనిమిత్తమై నిలిచిరని మోమాటము చెందుచు నయ్యిందు