పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

కాశీమజిలీకథలు - మూడవభాగము

గ్రామములోనున్న విప్రులందఱికి నా భూములే యాధారమై యున్నయవి. అదికారణంబున దుష్టవర్మ యిందున్న బ్రాహ్మణులనెల్ల నిత్యము పురాణము చెప్పుటకు రమ్మని యాజ్ఞాపించును. ఆయన యానతిగైకొనక పురాణమునకు బోవడేని యతని భూమి జరుగనీయడు. పురాణము చెప్పునప్పుడందున్న యర్థములుగాక విశేషార్థములు చెప్పుడని మందలించును. చెప్పినవానికి సమాధానము బొందక లేనిపోని శంకలు సేయును. చెప్పుకున్న బుద్ధిహీనులని నిందించును. యేమేని యిమ్మని యాచించిన బూర్వులిచ్చిన మాన్యములే చాలునని అన్నింటికిం జెప్పెను. ఈః యూరి పాఱుల కిదియొక యాపదలాగున్నది. మఱియొక చోటికింబోయి యాచించుకొనుటకు అవకాశములేదని యతని వృత్తాంతమంతయుం జెప్పెను.

ఆ మాటలు విని రామలింగకవి సుభద్రునితో నాలోచించి యా రాత్రి పయనముసేయక మఱునాడు పురాణము చెప్పువేళకు దుష్టవర్మ యింటికిం బోయెను అప్పుడు దుష్టవర్మ యున్నతపీఠంబునం గూర్చుండి చుట్టును చాపలమీద వసియించి బ్రమాణము చెప్పుచున్న బ్రాహ్మణులపై బూర్వపక్షములు చేయుచుండెను.

అతని పూర్వపక్షములు విని రామలింగకవి మిక్కిలి యీసుబూని యా ప్రాంతమున కరిగి నిలువంబడి యెల్లరును విన నెద్దియో చెప్పబోవు సమయమున దుష్టవర్మ రామలింగకవిం జూచి యడుగ వారిరువురకు నిట్లు సంవాదము జరిగెను.

దుష్ట - ఎవరుమీరు? ఏయూరు.

రామ - మేము బ్రాహ్మణులము, అద్భుత పౌరాణికులము. మా కాపురము కాశీపురము.

దుష్ట - అచ్చో! నా యెదుటనే పౌరాణికులమని చెప్పుకొనుట మా యొక్క వృత్తాంత మెఱుంగక యిట్లనుచున్నారు. ఈ బ్రాహ్మణుల నడిగి తెలిసికొనుడు.

రామ - మీ వృత్తాంతము వినియేవచ్చితిమి. ఈ బ్రాహ్మణులుం జెప్పిరి. మిమ్ముంజూచినంతనే వినినదానికి సరిపోయినదని తోచినది. మాపురాణ విశేషములు వినినచో మీరట్లనరు.

దుష్ట - అలాగునా! నాపే రింతకుము న్నెచ్చట వినిరి. కాశీపట్టణమువఱకు వ్యాపించినదా?

రామ - అయ్యో యిచ్చట గూరుచుండిన మీకేమియుం దెలియకున్నది. కాశీలో నెల్లెడలను మీనడతలే హల్లకల్లోలముగా జెప్పుకొనుచున్నారు. అదియుంగాక ధర్మలోకములో మీకొఱకు క్రొత్తగృహములు నిర్మించుచున్నారని వాడుకపుట్టినది.

దుష్ట - మీరేటికై యిచ్చటికి వచ్చిరి.

రామ - మా పురాణవిశేషములు మీకుం జూపుటకై ప్రత్యేకము మిమ్ముఁ జూడవచ్చితిమి.

దుష్ట - మీ పురాణవిశేషము లెట్టివి?

రామ - వినుండు. ప్రత్యక్షబాహాటకై యటశాకల్యవాత్స్యాయన శాకటాయన