పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

167

నీవ యాచరించవలయు నీయానతిమీదనేకదా ఢిల్లీకిబోవుటకు దానికాజ్ఞ యిచ్చితిని. అది విద్యావతి అగుటచే దన విద్యాపాటవము చూపి అచ్చటివారి వశపరచుకొని తన పక్షము తీరుపు చెప్పించుకొనగలదు కావున దగినపరివారముతో నీ వచటికి బోయి కార్యము సాధించుకొని రమ్ము. విజయమును బొందుమని పలికి అతని నొప్పించి సపరివారముగా నింటికిం బోయెను.

మందారవల్లియు నట్లు రామలింగకవిచే నవమానింపబడి మిక్కిలి విచారముతో నెవ్వరికి దెలియకుండ నిజనివాసమునకు బోయినది. ఆరాత్రి శిష్యవర్గంబునకు దానికి నీరీతి సంవాదము జరిగినది

హేమలత - ఏమమ్మా! ఇంచుకంతయు బ్రసంగము సేయకయే యోడిన ట్లొప్పుకొంటివి. లవిత్ర అంత ప్రజ్ఞావతియా యేమి! అయ్యో! నీవు సులభముగా వారిం బరిభవింతువని గంపెడాశలో నుంటిమి. ఏమియును లేకపోయెను. నీ వేసభలోను నింత పిఱికితనము బూనలేదే. ఇది గ్రహచారము గాబోలు.

మందా – (నిట్టూర్పుతో) హేమలతా! నీతో నేమి చెప్పుదును. గ్రహచారము చాలకయే మనమీ యూరు వచ్చితమి. లవిత్ర అనునదియొకతె యున్నదనుకొంటివా లేదు. లేదు. రామలింగకవియే అట్టివేషము వేసికొనివచ్చెను. కంఠధ్వనింబట్టి పురుషుడని తెలియలేదా.

మంజువాణి - అగుఁ గాక వెరవనేల? మనకు స్త్రీ పురుష వివక్షతతో బని యేమి? చూడతగినది విద్యాప్రసక్తిగదా. ప్రసంగ మేమిటికి గావింపలేదు. ఇదియే మాకందరికి సందియముగా నున్నది.

మందా - దేవరహస్య మొకటియున్నది అది మీకు దెలియకపోవుటచే నిట్లనుచున్నారు. ఎదుర నిలువంబడి నేనెవ్వరితో బ్రసంగింపలేను ప్రసంగించితి నేని నేమాటయు దోచదు. పూర్వ మొక యపచారనిమిత్తంబున సిద్దుడొకడు నన్ను శపియించెను. ఆ రహస్యమెట్లో గ్రహించి రామలింగకవి యిట్టివేషము వేసికొనియెను. ఏమిచేయుదును? ఆడువాండ్రచెంత రాణివాసమని చెప్పుట యుక్తియుక్తముగా నుండునా? యుక్తులలో మనకంటె నతడు పదియాకులెక్కువ చదివినవాడు.

హేమలత - ఓహో! ఇదియా తల్లీ ! ఈ రహస్యము మేమెఱుగము సుమీ! అన్నన్నా! ఎంతమోసము? ఎట్లుగ్రహించెనో తెలియదు. ఇందులకా నీవతండనిన నూరక బెదరుచుందువు. ఇప్పుడు మనమేమి చేయదగినది .

మందా - మనము ఢిల్లీపట్టణమునకుబోయి అందు జూడదగిన వారింజూచి మనవాదము గెలుచుకొనునట్లు చేసికొనవలయును.

ప్రియంవద - అది యెంతపని. మనల జూచినంత నాయవనప్రభువు మనపక్షమున దీరుపు చెప్పకుండునా. అందులకు నేనీపూట పనివాండ్రకు బయనము నియమింపనా?

మందా - అయ్యో! రాజశాసనము నీవు వినలేదు కాబోలు. జయాపజయ