పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

కాశీమజిలీకథలు - మూడవభాగము

లవిత్ర -- కింవచ్చి ఏకోపి వర్ణో మచ్చృతౌ నపతిత; పటుర్మేబధిరదోష, కింకరోమి?

ఎమందును? నీవన్న మాటలలో నొక్కక్కరమేని నాచెవిలో బడలేదు. నాకు జెవుడుమెండు ఏమిచేయుదును?

మందా - తధాచేత్కధ మావయో సంవాదః అట్లయిన మనకు ప్రసంగ మెట్లు?

లవిత్ర - కింవదసి? - ఏమనుచుంటివి?

అనువరకు సామాజికులందఱు పక్కుననవ్విరి. మందారవల్లి సోపహాసముగా పెద్దయెలుంగున వెండియుఁ జెప్పినది.

లవిత్ర - తరుణీ! మరియొక్క. విశేషము వినుము. నాకు శ్రవణదోష మింత యున్నను వీక్షణకౌశల్యమది హరింపుచున్నయది నేను జూచుచుండగా నెంతమందముగా మాటాడినను దెలిసికొనగలను. ఇదియే దైవము నాకు జేసినకీడులో మేలు. ఇప్పుడు రెండు తెరలడ్డముగా నుండ నీవెంత బిగ్గరగా అరచినను ప్రయోజనము లేదు.

మందా - పోనీ, పత్రికావాదము చేయుదుమా? (అని తన శిష్యురాలిచేత బిగ్గరగా అఱపించినది.)

లవిత్ర - పత్రికావాదమువలన బాండిత్యము తెలియబడదు. పుస్తకములు దగ్గరనుంచుకొని వ్రాయవచ్చును నీవింతదూరము రానేల! ఇంటియొద్దనుండియే వాదింపవచ్చునుగదా?

మందా - మఱియెట్లు?

లవిత్ర - మనమిరువురము స్త్రీలమేగదా? ఒండొరులమిట్లు తెరలువైచుకొని మాట్లాడుట యుచితముగా లేదు. రాజపత్నులకు సైతము స్త్రీలయెడల మాటులేదు . కావున నిరువురము నొక్క తెరలోనుండి గ్రంథము జరిగింతము . బలాబలములు తేలినపిమ్మట పొరితోషికము నందవచ్చును

మందా -- (కంపముతో) ఇందులకు నేను సమ్మతింపను. అని తాను జెప్పిన సంగతులన్నియు దెలియజెప్పుటకొక శిష్యురాలిని దెరముందర నిలువబెట్టినది.

లవిత్ర - నీవు సమ్మతింపనందులకు శాస్త్రప్రదృష్టాంతముల జూపవలయును. వట్టిమాటలకు మేమును సమ్మతింపము.

మందా — నావ్రతమట్టిది. స్త్రీలైనను బురుషులైనను వారియెదుట నిలిచి నేను వాదింపను.

లవిత్ర - కపటవ్రతంబులం బూని సంస్థానములం దోచికొనుటగాదు. ఇచ్చట అట్టివ్రతములు సాగవు. ఇందులకు శాస్త్ర మనావశ్యకమంటివేని అంతకన్న విషమవ్రతంబుల మాకునుం గలిగియుండునని దెలిసికొనుము.