పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

155

లశాస్త్రజ్ఞను, నేనశేషభాషావేదినిని, నేను సర్వలిపిశాస్త్రవేత్తను నే నష్టశతావధాననిపుణను నే vనర్గళసాహితీcjdమజ్ఞానధురీణనని యీరీతి నూర్వురును తమతమప్రజ్ఞాప్రభావములం జెప్పుకొనిరి.

పిమ్మట రామలింగకవి శిష్యులును నే నఖిలసిద్ధాంతశాస్త్రజ్ఞుడ నే నశేషసిద్దాంతభాషావేదిని, నేను సర్వసిద్ధాంతలిపిజ్ఞానకౌశలుండనని క్రమముగా నూఱ్వురువారు చెప్పిన విద్యలకు మొదటసిద్దాంతపదము ప్రయోగించుచు దమవిద్యలు సిద్దాంతమై నటులను వారివి కానియటులను సూచించునట్లు చెప్పిరి.

పిమ్మట రామలింగకవి శిష్యునకును మందారవల్లి శిష్యురాలికిని నీరీతి సంవాదము జరిగినది.

శిష్యురాలు -- ఆర్యా! నేను వ్యాకరణము భాష్యాంత మధ్యయనము చేసితిని. అంతయు ముఖస్థమై యున్నయది సిద్ధాంతము గావించెదను. యెందైన పూర్వపక్షం చేయుడు.

శిష్యుడు -- ముదితా! నీవు చదివిన వ్యాకరణ మెవ్వరు లిఖించినదో చెప్పుము పూర్వపక్షము చేసెదను.

శిష్యురాలు - ఆర్యా! అట్టి ప్రశ్నమునకే అవకాశములేదే?

శిష్యుడు - ఇందువదనా! ఎందువలన?

శిష్యురాలు - శ్లో. యేనాక్షరసమామ్నాయ మధిగమ్యమహేశ్వరాత్

కృత్స్నం వ్యాకరణం ప్రోక్తస్మైపాణినయేనమః!!

తా. ఏ మహానుభావుడు ఈశ్వరనటనసమయంబున బుట్టిన ఢక్కానాదం బూతగా బదునాలుగువేల సూత్రంబులు రచియించి విఖ్యాతిబడసెనో అట్టి పాణిని గాక వ్యాకరణమురచించిన ప్రఖ్యాతుడు మఱియెవడు?

శిష్యుడు - అల్పజ్ఞులే అంతయుం తెలియునని చెప్పుకొందురు.

శిష్యురాలు -- అట్లనుటకు గారణమేమి?

శిష్యుడు - నీ మాటలంబట్టిచూడ నీకాపాణిని వ్యాకరణముగూడరాదని తలంచెదను.

శిష్యురాలు - నామాటలు సంస్కారహీనములుగా నున్నవియా యేమి. తెలియ జెప్పినచో సవరించుకొనియెదను. ఇంతయేల యెందైన నడుగరాదా.

శిష్యుడు - ఎనిమిదవ అధ్యాయము మూడవపాదము పందొమ్మిదవసూత్రం చదువుము.

శిష్యురాలు -- లోపశ్శాకల్యస్య ఇదియేనా ?

శిష్యుడు - అగు నర్థము చెప్పుము.

శిష్యురాలు - అవర్ణపూర్వయోః పదాంతయోర్యపయో లోపోవాశి వలె అనగా ఆకారము పూర్వమందు గలిగినట్టియు బదాంతములైన యవలకు ఆశిప్రత్యాహారము పరమగునపుడు లోపము వైకల్పితముగా వచ్చును. ------