పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కాశీమజిలీకథలు - మూడవభాగము

ననే అంతవాడయ్యె తత్ప్రసాదస్వీకారమున నీకును విజయమగుంగాత అని దీవించి పల్కితిని.

అదియు సంతసించుచు నాకొక పారితోషిక మిప్పించి నీ విద్యాబలప్రభావముల గుఱించి తరచితరచి అడిగినది. నేనును దానికి వెరపుదోచునట్లు నీ వృత్తాంతము జెప్పితిని. పిమ్మట లవిత్ర చరిత్రము అడిగిన నాచిన్నది నీ శిష్యురాలే అని చెప్పితిని. ఆట్లు కొంతసేపు దానితో ముచ్చటించి అనిపించుకొని వచ్చితిని. నిన్ను దలంచికొని అది వెఱచుచునేయున్నది. ముందరికార్యము నీవే యోచించుకొనుమని చెప్పిన సంతసించుచు ఆతనిం బెక్కు తెరగుల బ్రశంసించెను.

ఇంతలో రాజనియోగమున మంత్రియు బాఠశాలకు బోయి అందు చదువుచున్న విప్రకుమారుల సమవయస్కుల వాచాలుర మనోజ్ఞరూపయౌవనశోభితుల వివాదపటువుల వటువుల నూర్వుర నేరి వారిం జాంబూనదాంబరాలంకారపండితులం గావించి రామలింగకవిశేఖరుని యింటికనిపెను. వారిం దనయింట బెట్టుకొని అతండు బోధింపవలసిన యంశములన్నియు సంక్షేపముగా దెలిపెను. చూసిన ముట్టికొను స్వభావముగల యావిప్రవటువులు తదుక్తవిధులన్నియు మనంబునం బట్టించుకొని విజయాభిలాషతో హెచ్చరికలు చేసికొనుచు యుద్ధమునకుబోవు శూరులవలె బొంగు చుండిరి. పిమ్మట రామలింగకవి యొక యుత్తరమిట్లు వ్రాయించెను.

విదుషీ! నీవు విద్యలచే ననవద్యవై నను గులంబున సామాన్యవగుట నశేషవర్ణపూజనీయులగు బ్రాహ్మణోత్తములచేతను వసుంధరాభారవహప్రవణులగు రాజన్యులచేతను అలంకరింపబడియున్న సభాభ్యంతరంబునకు నీవు పల్లకీ నెక్కి వచ్చుట యనర్హకృత్యంబని నీకును దెలిసియుండును. యెరింగియు ఆధిమకృత్యములం గావించిన వారికి నిష్కృతి లేదండ్రు అది అట్లుండె స్వకులోచితధర్మంబుల యథాన్యాయంబుగా నాచరింపనివారు దండనీతి బట్టి శిక్షాపాత్రులగుదురు. ఇంతకు మున్ను చేసిన యపరాధము మొదటితప్పుగా నెంచి మన్నించడమైనది. అని వ్రాయించి రాజముద్రాముద్రితమైన యయ్యాజ్ఞాపత్రిక సంపుటయు దానిం జదువుకొని యా చిగురుబోడి వేడి నిట్టూర్పు నిగుడ్చుచు బ్రియంవదతో బోటీ యీ చీటిం జూచితివా? నేను సభకు బోవుట తప్పట కులంబున సామాన్యనట. ఈమాటకర్దమైనదా? కానిమ్ము. జయపత్రిక నందిన పిమ్మట వీనికన్నిటికి సమాధానము చెప్పుదము మనలను విద్యలచేగాక కపటోపాయంబుల బరిభవింపవలయునని తలంచుచుండిరి. వీరిదేశములో వీరేమిచేసినను సాగునుకదా.

అని కొంతసేపు దానితో నావిషయము చర్చించి సభకూడకమున్ను పల్లకీ నెక్కిపోవుటకు నాజ్ఞయిమ్మని వినయముగా నుత్తరము వ్రాసికొని అట్లు గావించినది. మొదట సభనాడు మంత్రి సామంతపౌరపండిత మండితుండై పేరోలగమున నున్న యానృపాలుని మ్రోలనుండి మెండువైభవముతో బల్లకీనెక్కి యేగిన