పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగదత్తుని కథ

133

వేచియుంటిని. ఈతడు నీపుత్రు డిదియే మావృత్తాంతమని చెప్పిన విని కందర్పుఁడు లెక్కించుకొని యాహా! కాలమున కెంతవేగము గలదు? నడిచినట్లే యుండదు. ప్రజలకు శుభాశుభంబుల గూర్చుచుండును. ఆందులకే భగవంతుడు కాలస్వరూపుడని చెప్పుదురు. అయ్యో! ఇంతకాలమైనదనుమాట జ్ఞాపకములేదు. నేను సంవత్సరములోగా నింటికిబోవలయునని బయలువెడలితిని నాకొరకు మాతల్లిదండ్రులెంత విచారించుచుందురో? అదియునుంగాక సుభద్రమాట నీకు జెప్పియేయుంటినికదా? అత్తరుణియు మద్విరహార్తిఁ గృశించియుండునని చెప్పుచున్న సమయములో మఱియొక తరుణివచ్చి అడుగులంబడినది. దానినిజూచి అతండు విభ్రాంతుండై నాతీ! యీ తరణి యెవ్వతెయని అడిగిన మనోరమ ఆర్యపుత్రా! ఇదియే మీ ప్రధమప్రేయసియైన సుభద్రయని చెప్పినది.

ఏమేమీ! సుభద్రయే? ఇచ్చటికెట్లు వచ్చినదని పలుకుచు అక్కలికిని గ్రుచ్చియెత్తి కౌగిటజేర్చుకొని ముద్దాడి చేడియా? నీవిచ్చటికి వచ్చి యెంతకాలమైనది? ఈ భాంధవ్య మెట్లు తెలిసికొంటివి. నీరాక విదంబెట్టిదో చెప్పుమని అడిగిన అప్పడంతి అతనికిట్లనియె. రాజపుత్రా! అమ్మరజింకను గైకొని మీరరిగిన కొన్ని దినములకు మాతాత యొకనాడు గదిలోనున్న జింకను దీసిచూచి గుండెలు బాదుకొనుచు నన్ను బిలిచి సుభద్రా! నాగదిలోనున్న జింకనుదీసి ఇది యెవ్వరిట్లుంచిరని నడిగెను. నేనేమియు నెఱుంగనని మాటలు దడబడఁచెప్పితిని. ఆతం డనుమానము జెందుచు ఏమే? నిజము చెప్పుము. దానివలన నాకు బెద్దపనియున్నది చిరకాలము నుండి ప్రాణప్రదముగా దాచితిని. నీవు తీసినట్టే నాకు బొడకట్టుచున్నది. అని మొదట నెన్ని యోవిధముల సామముచేత నడిగిన నేనెఱుగనని చెప్పితిని.

అప్పుడతండు కోపించుచు నిజముగా నీవెఱుగవా అనిపలికి నన్ను దాపునకు రమ్మని యెద్దియో మూలిక నాతలలోనుంచి సుభద్రా! నీవీ జింక సంగతి యెఱింగియు జెప్పకుందువేని యిప్పుడే చిలకవై పోయెదవు సుమీ. యాలోచించుకొనుమని అడిగినను నేను లజ్జాభయంబులు మనంబున మత్తలపెట్టుచుండ నిజము చెప్పక బొంకులే పలికితిని. ఆమ్మూలిక ప్రభావమెట్టిదో కాని అప్పుడే నేను జిలకనై యెగిరి పోయితిని. అప్పుడు మాతాత విచారించుచు రమ్ము. రమ్ము. నీశుకత్వము బాపెదనని పిలిచెను. కాని అట్టి క్రూరునిచెంతనుండుట కిష్టములేక దూరముగానెగిరి యెచ్చటికో పోవుచున్న చిలుకలగుంపులో గలిసితిని. ఆ చిలుకలు రెండుమూడుదినములు నన్ను గ్రొత్తగా జూచుచు గ్రమక్రమంబున రానిచ్చినవి. పదిదినములవరకు నాకు జాతి జ్ఞానము గలిగియున్నది. అలోపల నేను దేవర అంతఃపురమునకు బోయి చూచితిని. కాని సర్వము శూన్యమైయున్నది. మీ తల్లిదండ్రులు నిద్రాహారములుమాని త్వదాయత్తులై యున్నవారు. దేవర దేశాంతరమరిగిన వార్తవిని నేనును ఆ గ్రామమును విడిచి కొన్ని చిలకలదోడుగా గూర్చుకొని పెక్కు దేశములు తిరిగితిని కొన్ని దినము