విద్యావతి కథ
125
సుఖముల దృప్తులైరి. నీకిప్పుడేమి బాధ. కపటోపాయంబున నాయిల్లంతయు గుల్ల జేసి నన్ను జోగినిచేసి విడిచిన వీని నూరక విడువుమని వేదాంత ముపదేశింతువా? దీనిబట్టిచూడ నాకు నీయందును ననుమానము గలిగియున్నది. మీయందరి సంగతియు రాజుతో జెప్పెదను. ఇప్పుడు పూర్వపురాజు కాడు, న్యాయాన్యాయములఁ జక్కగా విచారించు సామర్థ్యముగల గ్రొత్తరాజు నాగదత్తుడు సింహాసన మెక్కెను. ఆయన పట్టాభిషేకమహోత్సవమునకు నేను మేళమునకు బోయితిని. నిజముగా శ్రీవైకుంఠపదము దొరకునట్లే, నీవీ శ్రీహరిని బెట్టుకొని అప్పుడు వచ్చితివికావు. అప్పుడు నన్నాయన యెక్కుడుగా మెచ్చుకొనియెను. ఇప్పు డీమాత్ర ముపకారము చేయడా? అని పలికిన విని తల్లిమాట త్రోసివేయలేక విద్యాపతి యూరకుండెను. అంతలో దెల్లవారినది.
అప్పుడు కందర్పుడును పురోహితుడును దానికంటే ముందే రాజసభకు బయనమైరి కందర్పు డెందేని బారిపోవునని రత్నావతి వారిని విడువకయే నడువ దొడగినది రత్నావతియు విద్యావతియుఁ గందర్పుడు పురోహిత బ్రాహ్మణుడు రత్నావతి దాదులు మఱికొందరు వీధింబడి నడుచుచుండిరి. రత్నావతి దానమిచ్చునని యాసతో పెక్కండ్రు బ్రాహ్మణులు మూగుటయు బురోహితుడు వారితో నప్పుడు జరిగిన వృత్తాంతమంతయుం జెప్పిన నప్పౌరులెల్ల జప్పట్లుగొట్టుచు రత్నావతిని బరిహాసము జేయదొడంగిరి.
మఱియు నడిగిన వారికెల్ల పురోహితుడిట్లు చెప్పుచుండ బౌరులెల్లరు హల్లకల్లోలముగా దానివార్త జెప్పుకొనదొడగిరి ఆహా! విద్యావతి తెలివి అంతయు నెందుబోయినది. యెవ్వడో వచ్చి శ్రీహరి ననినంత మాత్రమున నమ్మి తల్లిచే నింటగల ధనమంతయు బంచి పెట్టించినది. బాపురే యా బుద్ధిశాలి యెవ్వడో మంచి పుణ్యాత్ముడు దరిద్రులుగా నుండిన పెక్కండ్రు బాపనయ్యలు వీని మూలమున ధనికులైరి ఆ రత్నావతి యెందరికొంపలు దీసినది దానికి ప్రాయశ్చిత్తము కావలసినదే దీనికి నాగదత్తు డేమి న్యాయము చెప్పునో వినవలయునని యనేకు లనేకరీతుల జెప్పుకొనుచుండిరి. ఆయాక్షేపణవాక్యము లన్నియు వినుచు రత్నావతి సిగ్గుతో దలవాల్చుకొని వారితో గూడ నారాజసభకు బోయినది.
ఆ విచారణము వినుటకై పౌరులు, పెక్కండ్రు గుంపులు గుంపులుగా గూడు కొని యారాజస్థానమునకు బోదొడగిరి.
ఆనృపతియు వారియాగమనకారణముల వేరువేర పత్రికాముఖంబుల తెలిసికొని వారి నుచితస్థానముల గూర్చుండ నియమించి అందు ముందుగా రత్నావతిని నీవేమి చెప్పుకొనియెన వని యడిగిన అది లేచి నమస్కరింపుచు నిట్లనియె.
దేవా! నేను దేవరదాసురాలను. రత్నావతి యను దానను ఇది నా కూతురు విద్యావతి యనునది మా అక్క రుక్మవతి దాని గూతురు కామమంజరి కొన్ని