పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

కాశీమజిలీకథలు - మూడవభాగము

దటాలున అతని కప్పడఁతి జ్ఞాపకము వచ్చినది. అంత నాకందర్పుండు హా! ప్రేయసీ మనోరమా! అని పలుకుచు గరమాల ఖండితమైన పాదపంబు చందంబున నాజింకను విడిచి నేలంబడి మూర్ఛిల్లెను.

అప్పు డాజింకయుఁ గీలెడలుటచే గాలిపోయి చర్మమువలె నేలంగూలినది. అది చూచి విద్యావతి అయ్యో! సామీ! యిది యేమి యిట్లు పడితిరి? నాయం దనుగ్రహము దప్పెనా? అని శైత్యోపచారములఁ గావించుచు సేదదేర్చినది.

ఆతండు లేవకయే హారాజపుత్రీ! నిన్నెంత మోసము జేసితినే? కటకటా? అంతఃపురమున నుండనీయక నట్టడివిలో బాఱవైచితిగా! ఏనైతో, నన్నేమని వలవించితో! ఎట్టి యిడుమలం గుడుచుదున్నదానవో యని యూరక పలవరింపఁ దొడంగెను. అప్పుడు రత్నావతి కూతుంజూచి అయ్యో! శ్రీహరి కిట్టి అవస్థ యేమే? నిజముగా నితడు శ్రీహరియే? నాకనుమానముగా నున్నది. మీ గరుడవాహన మట్లు తోలుగానుండనేల? ఇదిఅంతయుఁ గపటముగా దోయచున్నది. నీవు గ్రహింపలేక నాకొంప ముంచతివి, ఇక నేమి యున్నదని గుండెల బాదుకొనుటయు దల్లిని వారించుచు విద్యావతి అయ్యో! అట్లనకే ఆయనకు గోపమువచ్చును. ఈస్వామికి మన మొక్కండ్రమే? ఎందరు దాసురాండ్రుగలరు. యెవ్వరో జ్ఞాపకమువచ్చిన వారికొర కిట్లు చింతించుచున్నట్లు తలంచెదనని పలుకుచు వెండియు అతని అడుగు లొత్తుచు స్వామీ! యింకను దెలివిరాలేదా? ప్రొద్దుపోయినది. వైకుంఠమునకు బోవుదము. లెమ్మని పలుకగా అతం డిట్లనియె.

అయ్యో! యెక్కడి వైకుంఠము? నీ వెవ్వతవు? కటకటా! కీలుజింక లేకపోయిన నింత మోసము రాకపోవునుకదా? అని సన్ననియెలుంగున మణియు పలవరింప దొడంగెను.

అప్పు డవ్విద్యావతి వెండియు నెద్దియో వేడుకొనబోయిన రత్నావతి యాక్షేపించుచు ఓసీ! నిర్భాగ్యురాలా? ఎక్కడి శ్రీహరియే? ఇంకను వేదనవుట నాకు దెలిసినది. ఇది కీలుజింక. దీని కిట్లు రంగులువైచి వీడెవ్వడో మనకొంప ముంచినాడు. నీ మాటనమ్మి నేనును గంగలో దిగితిని. అయ్యో? కట్టుకొనుటకు గుడ్డయినను లేదే? ఏమిచేయుదునని పలుకుచు నాజింకను పట్టుకొని విప్పిచూడ మరలు కనబడినవి.

అవి అన్నియు గూతునకు జూపుచు గత్తిచే నాజింకను గోసి యొకమూల, బారవైచి యిక నీ అనుమానము దీరినదాయని గుండెలు బాదుకొని యుచ్ఛస్వరంబున రోదనము జేయదొడంగెను. అయ్యాంక్రందనధ్వని విని దాని దాదులందరు అచ్చోటికి వచ్చి దానింజుట్టుకొని యేమి యేమని అడుగజొచ్చిరి.

అది వాండ్ర జూచి అయ్యయ్యో మీతో నేమని చెప్పుదుము? నా కూతురే నన్నేటిలో దింపినది. నాయైశ్వర్యమంతయు నొక్కదినములో బోయినది. అన్నన్నా యెట్టి జల్తారుచీరలే! యెట్టి మంచములే! ఎట్టివాహనములే! అటువంటివి