పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

114

కాశీమజిలీకథలు - మూడవభాగము

యగు మజ్జనని యొకతె యున్నది. దాని గుఱించి యించుక చింతించుచున్నదాన. మహాత్మా, ఎవ్వరికిని దల్లిరుణము దీర్చుకొనుట కష్టముగదా! శిశుతనంబున దల్లి పిల్లకు జేయునుపచారము లేతన్మాత్రములే! అట్టివారి విషయమై కృతజ్ఞత జూపనివారు మహాపాపాత్ములుగదా! నా నిమిత్తంబున మజ్జనని కొక్కసారి దర్శనంబీయ వేడెదను. భవద్దర్శనంబై న పిమ్మట వైకుంఠగమనంబున కర్హురాలనని యేను వక్కాణింపగలను. మీచెట్ట బట్టినందులకు నాకీపాటి యుపకారము సేయకతప్పదని ఎంతయో నైపుణ్యముగా బ్రార్థించినది.

అప్పు డతం డాశ్చర్యముఖముతో ఏమేమీ! మీ తల్లికా? నన్ను దర్శన మిమ్మనుచుంటివి. చాలుచాలు! అదిచేసిన పాతక విశేషముల నల్పములుగా నున్నవనియు దాని కొరకు గ్రొత్త నరకముల గొన్నిటి నిర్మింపవలసి యున్నదనియు నాజ్ఞయిమ్మని మొన్ననే కృతాంతుడు చిత్రగుప్తులచే నాకు వ్రాయించి పంపించెను.

అట్టివాని గట్టుటకు నేనును సెలవిచ్చితిని ఆ విషయ మెఱుంగక దానినిగూడ వైకుంఠమునకు దీసికొని రావలయునని తలంచుచుంటివి కాబోలు? మంత్రపూతం బయిన పురోడాశము కుక్క కర్హమగునే అని పలికిన విని యుల్లము ఝల్లుమన నప్పల్లవాధరి మూర్చిల్లి యల్లంతలొ దెలిసి నాకన్నుల బాష్పమ్ము గ్రమ్మ నంజలిఘటించి ధైన్యంబుదోప వెండియు అతని కిట్లనియె.

దేవా! సోదికిం బోయిన మతరంకులు బయల్ర్పడినయట్లు ఏమేమో చెప్పుచుంటిరి. మీ చరిత్రలు నేనెఱుంగనవి కావు. అజామీళుని కన్న మా తల్లి పాపాత్మురాలా? స్వకులధర్మంబులు దూష్యములైనను దుష్కృతహేతువు కాదండ్రు. సర్వస్వతంత్రనై యున్న మీరేమి చేసిన సాగకుండు? కాదనువారెవ్వరు? సర్వేశ్వరా! నీకు నేను బ్రేయసినై యుండి మా తల్లిని మాత్రము రక్షించుకొనజాలనా? నీదర్శనం బైనచో నన్ని పాతకములును భస్మములై పోవును. దానికి నిష్కృతి చెప్పకుంటిరేని యిప్పుడ మీమ్రోల ప్రాణముల బోగొట్టుకొందునని చనువును భయభక్తివిశ్వాసములు దగునట్లు బ్రార్దించిన విని అతండు లోపల నవ్వుకొనుచు విధిలేక యాచరించువాడువలె యించుక నొక్కి కాసేపు ............. దాచుకొనకూడదు. వస్త్రావశేషముగా దీసికొనివత్తువేని దర్శనం బిత్తును. దానం బూతుపాలగునని చెప్పి అతడు వేళ యగుటయు చర్మకురంగ మెక్కి యాత్మీయనివాసంబునకుం బోయెను.

పిమ్మట విద్యావతి తల్లి యొద్దకువచ్చి యావృత్తాంతమంతయుం జెప్పినది. రత్నావతియు వానిసంవాదమంతయు అంతకుమున్ను గవాక్షవివరములోనుండి విని