పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనోరమ కథ

103

జయంతాదులలో నొకండు కావలె గానిచో నిట్టి సౌందర్యము మనుష్యమాత్రునికి గలుగునా? నిక్కువము కందర్పుడే నిన్ను వరించివచ్చె దివ్యపురుషునికి గాక యీ శుద్ధాంత మెట్లు చొరనగునని చెప్పెను.

మనోరమ యించుక సిగ్గభినయించుచు సఖీ! యూరక మనల మోహింపజేయుటకై యిట్లు వ్రాసెనేమోకాని నిజముగా నిట్టి యాకారము గలవాడుండునా? నాకు సందియముగా నున్నదనుటయు నామధురిక కాదుకాదు యదార్థమే ఏలన నీరూపమును బట్టి చూచుకొనుము. నీయాకృతికి ఈయాకృతికి నించుకయేని భేదమున్నదా? అదియు నట్టిదే. ఇట్టియాకారము గలవారు మనుష్యులలో నుండుట అరుదు కాని దేవతలలో నుందురు. అని మధురిక చెప్పిన విని మనోరమ మోహపరవశయై యాచిత్రపటమును గౌగిటంజేర్చి మోము వంచి ముద్దిడుకొనియెను.

అప్పుడు మధురిక మిక్కిలిగా నవ్వుచు జవ్వనీ! ప్రతిబింబము జూచియే యింతవలపు జెందుచుంటివి. నిక్కముగా నా పురుషత్నమును జూచినప్పు డేము చేయుదువోగదా! యని పరిహసించిన అమ్మించుబోడి సఖీ : ఈరహస్యమెవ్వరికిం జెప్పకుమీ! అంతభాగ్యము పట్టినప్పుడు చింతింతములే, కాంతా ! ఈదినమున మనము పగలంతయు నిద్రబోయి రాత్రి మేలుకొందుము. అట్లైన నిద్రరాదు. అని యొండొరు లాలోచించుకొని పగలంతయు నిద్రబోయిరి. సాయంకాలమున నాఅంతఃపుర మంతయు వింత అలంకారములు గావించిరి అక్కాంతయు మనోహరభూషణాంబరములు దాల్చినది. అతని రాక నిరీక్షించుచు మథురికతో గూడ నిద్రబోవు దానివలె బరుండి కన్నులు మూయుచు దెఱచుచు జీమ చిటుక్కుమన్న అతడే అనుకొనుచు నీరీతి గాచియుండెను.

అంత గందర్పుడును యథాప్రకార మలంకరించుకొని అక్కురంగంబు నెక్కి సత్వరముగా నామేడకుం బోయి అందేమియు సందడిలేకుండుటకు సంతసించుచు నల్ల నల్లని అప్పల్లవపాణియున్న గదిలోనికిం బోయి నలుమూలలు తొంగిచూచెను అప్పుడతనింజూచి యాచిగురుపోడి అబ్బురము జెందుచు సౌందర్యమునకు మెచ్చుకొని అతని నొక దివ్యపురుషునిగా దలచి కదలక అతం డేమిచేయునో చూచెదంగాక అని కన్నులమూసికొని నిద్రబోవుదానివలె అభినయించుచుండెను. ఆరాజకుమారుండు మారశరవేదన మేదురం బగుటయు నాత్మగతంబున అయ్యో! రెండు రాత్రులూరక వృధ పోనిచ్చితి. యిమ్మచ్చెకంటి యిచ్చయుం దెల్లము కాకున్నది. ఈరేయినిందు సఖురాండ్రెవ్వరు బరుండియుండలేదు. ఒక్కతియ మాత్రము దాపున పండుకొని యున్నది. పర్యంకము దాపున గాంచనపీఠం బుండుటకు గతంబేమియో తెలియదు చందనాగరు దాంబూలాదిసుగంధద్రవ్యంబులు సవ్యంబు రసల్పంబులుగా మునుపుండు చోటునంగాక తల్పంబు దాపున నిడియున్నవి. ఈచిహ్నంబులన్నియుం జూడ నచ్చేడియ నారాక కనుమతించునట్ల తలంచెద. ఏమైనను మేలయగుంగాని యీరాత్రి నా