పుట:Kapala-Kundala-Telugu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవకుమారుఁడు సద్వంశజుఁడు. అతఁ డామె మాటలకప్ర తిభుఁడై శిరము వంచుకొని నిరుత్తరుఁడై యుండెను. అంత నా రమణి మందహాసము చేసి “మీరు స్త్రీల నెప్పుడును జూడ లేదా? నే నందముగా లేను కాఁబోలు” అని పలికెను. సామాన్యముగా నీమాటలు తిరస్కార సూచకములుగాఁ దోఁచును. కాని యామె చిఱునవ్వుతోఁ బలుకుట చే నందుఁ జమత్కారముతప్ప మజేమియు నతనికి స్ఫురింప లేదు. ఇంత మధురమైన ప్రశ్నమున కెవరు ప్రత్యుత్తర మీయకుందురు? గావున నవకుమారుఁడు | స్త్రీలను జూచితిని గాని నీవంటి సౌందర్యవతిని జూడ లే' దనెను. ఆ రమణి దర్పముతో ఒక్క తెకూడ లేదో ?' యనునప్పటి కాతని హృదయమున కపాలకుండలా సౌందర్యము మెలఁగుచుండుటచే నతఁడును దర్పముతో (ఒక్క తెకూడ లేదని చెప్ప లే' ననెను. ముచిది, ఎనరామె? మీయిలాలా ?" (ఇల్లా లని యేట్లనుకొంటివి ?” 41వంగ దేశీయులు తమ భార్యలంత చక్కనివా రెవ్వ రుండ రనుకొందురు." ( నేను వంగ దేశీయుఁడను, నీవును నంగాంగనవలె మాట లాడుచున్నావు. మీ దే ప్రాంతము ?" ఆ యువతి తన దుస్తులపై దృష్టినిల్పి (6-ఈ దురదృష్టురాలు వంగ స్త్రీ ముసల్ మానీ" దుస్తులవంకఁ జూడ నవకుమారున కామె నిజముగా ముస యనెను. ఆమె