పుట:Kapala-Kundala-Telugu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలకుండల మఱియొకప్పుడవి మోహవిస్ఫారితములై మదనోద్వృత్తిచే దళతళలాడుచుండును. ఇంకొకప్పు డామే లోలాపాంగములలో నీరదముల నడుమ విద్యుల్లతలవ లెఁ గ్రౌర్యము విశద మగు చుండును. ఆమేముఖ కాంతిలో రెండువిషయము లనిర్వచనీయశోభా పంతములు. మొదటిది సర్వమును భేదింపఁగల బుద్ధిప్రభా వము; ఆత ఆత్మగరిమ రెండవది. అందుచే నామే తనమ గాళ గ్రీవము నించుళ వంచి మోహనముగ నిలుచుండెనేని రమణీ కుల రాజ్ఞవలెఁ జూపట్టక మానదు. భాద్రపదమందలి నిండునదివలె నామె పదు నేడేండ్లవయ స్సున నున్నది. తన్న దీజలమువలె నామె లావణ్యము తల తలలాడుచుఁ బొంగిపొరలుచున్నది. మేని మెఱుఁగుకన్నను గన్ను ల నిగ్గుకన్నను నన్నిటికన్నను నామె సౌందర్యప్రభా వము మఱింత సమ్మోహకరము. పూర్ణయావనస్ఫూర్తి చే నామె తనువెల్ల నిరంతరము కొంచెము. కొంచెముగఁ గదలు చుండెను. మారుతము లేనప్పు డించించుక కదలు శరన్నది వలె నామె దేహవల్లి చలించుచుండెను. మాటిమాటికి వెలికి వచ్చు నూత్నశోభ యే యామె శరీర చలనమునకుఁగారణము, నవకుమారుఁ డనిమేషనయనములతో నామె సూత్నశోభను దిలకించుచుండెను. టెప్పవాల్పక యతఁడు విలోకించుచుండుటఁ జూచి యా, సుందరి (ఏమి చూచుచున్నారు ? నా చక్కదనమునో? ???? యనెను.