పుట:Kapala-Kundala-Telugu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దితపూర్ణచద్రబింబము గాని హేమాంబుదకిరీటయగు నుషా డేవి గాని సువర్ణ వర్ణల మేనిరంగులకు సరిపోలవచ్చును. చాలమంది హేమాంగులను మెచ్చు కొనుచుదురు. కాని యిట్టి శ్యామవర్ణమును జూచి మోహితుఁ డగువానిని వర్ణ జ్ఞానశూన్యుఁడని చెప్ప రాదు. చామనచాయును మెచ్చుకొనని వారొక్కసారి లేమామిడి చిగుళ్ల విహరించు తు తుమ్మెదగుంపుల వలెఁ గాంతు లీనుచు శ్యామలవదనమున వేలాడు నామె ముంగురులు మనస్సునకుఁ దెచ్చి కొనుఁడు. సప్తమినాటి చందునివంటి లలాటముందు ముంగురుల ముద్దుఁగొను నా మే కనుబొమలు జ్ఞప్తి కిఁ దెచ్చుకొనుఁడు. పండిన సహకార పర్ణ ' ములఁ బోలు నామే కపోలములను, వాని నడుమ నత్యంత . రక్తి మగల యామె యధరోష్ణమును జ్ఞప్తికిఁ దెచ్చి కొనుఁడు. అప్పుడాయపరిచితరమణి సుందరులలో సుందరి యని యను భూతము కాఁగలదు. ఆమె కన్ను లతివిశాలములు కావు; అయిన నవి పట్రువలు పల్లవ రేఖావిశిష్టములు, నత్యుజ్వలములు. ఆమెకటాక్షములు స్థిరములు, మర్మభేదకములు. ఆ మేదృష్టిపైఁబడెనని మనోగత రహస్యములనుగూడ భేదించుచున్నదనిపించును. చూచుచుండ మర్మభేదకములగు నామె దృష్టులు భానాంతరము నొందు చుండును. నయనములు కోనులము లై ప్రేమరసమున నోల లాడుచుండును. ఒకొక్కప్పుడామె కన్నులు మన్మధుని టిండ్లవలె సుఖావేశ జన్ళి మగునలసటను బ్రకటించుచుండును.