పుట:Kanyashulkamu020647mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంక -- నీకు యంతచెప్పినా తెలియదు. (గట్టిగా) ఆయన ఉద్యోగం చెయ్యకపోవడం, పెళ్లి మానుకోవడం లోకం మరామత్తు చెయ్యడానికట; యిప్పుడు తెలిసిందా?

బుచ్చమ్మ-- యలా మరమ్మత్తు చేస్తున్నార్రా?

వెంక-- నావంటి కుర్రాళ్లకి చదువుచెప్పడం. (నిమ్మళంగా) చుట్టనేర్పడం. (గట్టిగా) నాచ్చికొశ్చన్‌ అనగా సానివాళ్ల నందర్ని దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్‌ కాంగ్రెస్‌ - అనగా దివాన్గిరీ చలాయించడం ఒహటి. యిప్పుడు తెలిసిందా?

బుచ్చమ్మ-- ఉద్యోగం చెయ్యరన్నావే? దివాన్గిరీ యేరాజుదగ్గిర్రా?

వెంక --యేరాజుదగ్గిరా? - ఆడదానివి నీకెందుకూ యీ భోగట్టా అంతాను?

బుచ్చమ్మ-- నువుకూడా లోకం మరమ్మత్తు చాస్తావుష్రా?

వెంక-- ఓ!

బుచ్చమ్మ-- ఐతే వెధవముండనికూడా పెళ్లా`డతావురా?

వెంక-- నాన్న తన్నకుండావుంటే తప్పకుండా పెళ్లాడతాను; గాని బోడిగుండు చేస్తేమాత్రం నాకక్ఖర్లేదు.


[గిరీశం ప్రవేశించి.]


గిరీశం-- వదినా యీ చెట్టుకింద నిలబడితే మీరు వనలక్ష్మిలా వున్నారు. (బుచ్చమ్మవైపుతేరి చూసును.)

బుచ్చమ్మ-- విన్నారా? తమ్ముడు వెధవని పెళ్లాడతాష్ష!

గిరీ-- నా ప్రియశిష్యుడూ, మీకు ప్రియసోదరుడూ అయిన వెంకటేశం విధవావివాహవేఁ చేసుకుంటే, మేం యావన్మందివిఁన్నీ బ్రహ్మరధం పట్టవాఁ?

బుచ్చ -- గురువులుగదా ముందు మీరెందుకు చేసుకోరు?

గిరీ -- ఆడగవలిసినమాట అడిగారు. చెబ్తాను వినండి. మీ రడిగినతరవాత చెప్పకపోవడం తప్పని చెబుతున్నానుగాని, యీ మాటలు చెప్పవలిసినవి కావు. యేవఁంటారా? నా గొప్ప నే చెప్పుకోకూడదుగదా? అదొహటి. అంతకంటె ప్రమాదమైనమాట మరోటుంది. చూశారా వొదినా!- మొదట్నించీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయివున్న అత్తగారూ, మావఁగారూలాంటి పెద్దవాళ్లకి యెన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్లకి నెత్తికెక్కవు. యిలాంటి మాటలు వాళ్లతో మనం చెప్పినట్టాయనా కఱ్ఱుచ్చుకుంటారు. మావఁగారు వేదంమట్టుకే చదువుకున్నారుగాని నేను శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. అబ్బో, నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు యేవఁన్నాడూ? "బాలాదపి సుభాషితం" అన్నాడు. అనగా