పుట:Kanyashulkamu020647mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చమ్మ -- నాన్నా! అమ్మ స్తానానికి లెమ్మంచూంది.

అగ్ని-- అలాగే. (బుచ్చమ్మ వెళ్లిపోతూండగా గిరీశం కేగంట చూసును.) భోజనంచేశిన తరవాత కాయితాలు మీచేతికిస్తాను; అవన్నీ సావకాశంగా చూడండి, మాయింటితూరు ప్పొరుగు రావాఁవుధాన్లుమీద మందడిగోడ విషయమై మనంతెచ్చినదావా, లంచంపుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జీకోర్టులో అప్పీలుచేశాం; మావకీలు అవతలపార్టీదగ్గిర కతికి మనకేసు ధంసంచేశాడు. మీవంటివారు నాకు చెయ్యాసరావుంటే రావాఁవుధాన్లు పిలకూడదీసేదును: కానిండిగాని తూర్పుమందడిగోడ రావాఁవుధాన్లిదయితే, పడవఁటి మందడిగోడ మందవాల్నా లేదా? న్యాయంచెప్పండి. చూడండీ దానిమీద యలా కొంజాయెత్తాడో! క్రిమినల్నడిపించమని భుక్తసలహాచెప్పాడు.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చ-- నాన్నా! అమ్మ స్తానం చెయ్యమంచూంది.

అగ్ని-- వెధవముండా సొద! పెద్దమనుష్యుల్తో వ్యవహారం మాట్లాడుతూంటే రామాయణంలో పిడకల వేట్లాటలాగ అదే పిలవడవాఁ!

గిరీ-- తప్పకుండా క్రిమినెల్కేసు తావలశిందే, క్రిమిన ల్ప్రొశిజ్యూర్‌ కోడు 171 శక్షన్‌ ప్రకారం తెద్దావాఁ? 172డో శక్షన్‌ ప్రకారం తెద్దావాఁ?

అగ్ని-- రెండు శక్షన్లూ తాలేవేఁం?

గిరీ-- నేరంగలప్రవేశం, ఆక్రమణ - రెండు శక్షన్లూకూడా ఉపచరిస్తాయి సరేగదా కళ్లతో చూశాను గనుక యీగోడ మీదయినట్టు జల్లీల్తెగబొడిచి సాక్ష్యంకూడా పలగ్గలను, యీగోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతూంది.

అగ్ని-- అందుకు సందేహవుఁందండీ, యేమరిచి యిన్నాళ్లు వూరుకున్నాను. పెరటిగోడ కూడా చూతురుగాన్రండి. అక్కాబత్తుడిముక్కు నులిపిగెల్చుకున్నాను. కాని యీదావాలకింద సిరిపురంభూవిఁ అమ్మెయ్య వలసి వొచ్చిందండి, రావాఁవధాన్లుకేసుకూడా గెలిస్తె, ఆవిచారం నాకు లేకపోవును.

(అందరు నిష్క్రమింతురు.)

---*---