పుట:Kanyashulkamu020647mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రి బ్రహ్మానంద భరితుడైనాడు. లుబ్ధావుఁధాన్లు పెళ్లికి అన్నిటికన్న పెద్ద సవబొకటి నీకు చెబ్తానువిను.

వెంక-- యెవిఁటండి.

గిరీ-- లుబ్దావుఁధాన్లు ముసలాడూ, బంగారప్పిచికానున్ను. రెండేళ్లకో మూడేళ్లకో అమాంతంగా బాల్చీ తన్నెస్తాడు. అనగా "కిక్స్‌ ది బకెట్‌." దాంతో నీ చెల్లెలు రిచ్చి విడో అవుతుంది. నువ్వు పెద్దవాడివైన తరవాత దానికి విడోమారియేజి చేశి శాశ్వతవైఁన కీర్తి అతిసులభంగా సంపాదించవచ్చును. యెవఁంటావ్‌?

వెంక-- అవును.

గిరీశం మరో గొప్పమాట యీ సంబంధం అయితె నీకూనాకూ సంబంధం కలుస్తుందోయి.

వెంక-- అదినాకిష్ఠవేఁ.

గిరీ-- రాత్రి నీ తండ్రి, నీకు హైకోర్టు వకాల్తీదాకా చదువు చెప్పిస్తానన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాలమాట కదిపానుగాని, పెళ్లినుంచి వచ్చింతరవాత యిస్తానన్నాడు. యీలోగా చుట్టముక్కల్లాకపోతే గుడ్లెక్కొస్తాయి. సిగర్సుకోసం కాపర్సేవఁయినా సంపాదించావాలేదా?

వెంక-- లేదు. యీ వుదయవఁల్లా అమ్మ ధుమధుమలాడుతూనే వుంది. మానాన్న పొడుంకోసం కొట్లోనిలవచేశిన పొగాకులోది వోకట్ట వోణీలో దాచి తీసుకొచ్చాను.

గిరీ -- దటీజ్పోలిటిక్స్‌! మరియింతసేపూ చెప్పావుకావేం? చుట్టల్చుట్టుకుని యీకోవిల గోపురంలో కూచుని కాల్చుకుందాం రా!

వెంక-- కోవిల్లో చుట్టకాల్చవొచ్చునా?

గిరీ-- కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీనిపొగ ముందర సాంబ్రాణి, గుగ్గిలం యేమూల? యేదీ కట్ట యిలాతే (కట్ట అందుకొని వాసనచూసి) ఆహా! యేవిఁ పొగాకోయి! నిజంగా కంట్రీలైఫులో చాలా చమత్కారంవుంది. బెస్టుటోబాకో, బెస్టుగేదెపెరుగు, మాంచిఘీ. అంచేతనేనోయ్‌ పోయట్సు "కంట్రీలైఫ్‌ కంట్రీలైఫ్‌" అని దేవులాడుతారు.

వెంక-- మీరూ పోయట్సేగదా?

గిరీ-- అందుకభ్యంతరవేఁవిఁటి? నాకూ కంట్రీలైఫు యిష్ఠవేఁగాని సీవఁలోలాగ బ్యూటిఫుల్‌ షెపర్డెస్లూ, లవ్‌ మేకింగూ వుండదోయ్‌. గ్రాస్‌ గర్ల్సు తగుమాత్రంగా వుంటారుగాని, మా డర్టీస్మెల్‌! అదొహటిన్నీ మనదేశంలో