పుట:Kanyashulkamu020647mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకమ్మ-- మనవాడికో మునసబీ ఐనా పోలీసుపనైనా ఐతే రుణాలిచ్చి యీ అగ్ఘురారం భూవుఁలన్నీ కొనేస్తాడు. యాడాదికో నూఱ్ఱూపాయలు కర్చుపెట్టడానికింత ముందూ వెనకాచూస్తున్నారు, మీలాగేవాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని వుందా యేవిఁషి? మీకంత భారవఁంతోస్తే మావాళ్లు నాకు పసుపూకుంకానికీ యిచ్చిన భూవఁమ్మేసి కుఱ్ఱాడికి చదువుచెప్పిస్తాను.

కరటకశాస్త్రి -- నీభూవెఁందు కమ్మాలమ్మా? మనసొమ్ము చడతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు.

అగ్ని-- ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీ మారంటే నీ అన్నవున్నాడని వూరుకునేదిలేదు.

[గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]

వెంక-- మావాబ్బా బాబు వచ్చావషొయ్‌! (వెంకటేశమును కౌగలించుకొనును.)

అగ్నిహో-- వెధవాయా యీమారైనా పా`సయినావా? (వెంకటేశం తెల్లబోయి చూచును.)

గిరీశం-- పాసయినాడండి, ఫస్టుగా పాసయినాడు. నేను చాలాశ్రమపడి చదువు చెప్పానండి.

అగ్ని-- యీతుర కెవడోయ్‌!

గిరీశం-- టర్క్‌! డామిట్‌, టెల్‌మాన్‌.

అగ్ని-- మానా? మానులావుంచా నంఛావూ? గూబ్బగలగొడతాను.

వెంకటేశం-- (వణుకుతూ తల్లివేపుచూసి) అమ్మా యీయ్నే నాకు చదువు చెప్పే మేష్టరు.

కరట-- ఇంటికి పెద్దమనిషొస్తే అపృచ్ఛపు మాటలాడతావేవిఁటి బావా? ఆయనేదో కుఱ్ఱవాడితో యింగిలీషు మాటంటే పుచ్చకాయలదొంగంటే బుజాల్తడువుఁకున్నట్టు నీమీద పెట్టుకుంటావేం?

(బండివాడు సామానుదించును.)

గిరీశం-- (కరటకశాస్త్రితో) తమ బావగారా అగ్నిహోత్రావఁధాన్లుగారు? నన్ను తమరు యరక్కపోవచ్చునుగాని డిప్టీకలక్టరుగారింటికి తమరువచ్చేటప్పుడు నేను వారి పిల్లలికి చదువుచెబుతూ వుండేవాణ్ణి. డిప్టీకలక్టరుగారు తమర్ని యే మ్మెచ్చుకునేవారనుకుంటారు!

కరట-- అవును మీమొఖం చూచిన జ్ఞాపకవుఁంది. డిప్టీకలక్టరుగారు మహదొడ్డప్రభువ్‌.

గిరీశం-- మీలాంటి చప్పన్నభాషలూ వచ్చిన మనిషి యక్కడా లేడనీ, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమలాంటి విదూషకుణ్ణి యక్కడా చూళ్లేదనీ డిప్టీకలక్టరుగారు శలవిస్తూండేవారు. కవితారసం